పరేష్ రావల్‌కు మద్దతు.. నేనూ యూరిన్ తాగాను: నటి అను అగర్వాల్

బాలీవుడ్ నటుడు పరేష్ రావల్(Paresh Rawal) గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘శంకర్ దాదా MBBS’, ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలతో ఆయన టాలీవుడ్‌(Tollywood)లో చాలా మందికి సుపరిచితుడయ్యాడు. అటు బాలీవుడ్‌(Bollywood)లోనూ అనేక సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు. తన మోకాలికి గాయం అయ్యిందని, దాని నుంచి కోలుకోవడానికి తాను యూరిన్(Urine) తాగిన‌ట్టు చెప్పుకొచ్చాడు. తాజాగా పరేష్‌ వ్యాఖ్యలకు బాలీవుడ్ నటి అను అగర్వాల్(Anu Agarwal) మద్దతు తెలిపింది. తాను కూడా యూరిన్ తాగినట్లు హీరోయిన్ అను అగర్వాల్ తెలిపింది.

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా ఆషికి(Aashiqui) చిత్రం 1990లో విడుదల కాగా, ఆ సినిమాకు ప్రేక్షకులు ఎంతో మంది ఫిదా అయ్యారు. అందులో అను అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమాతో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. అయితే తాను యారిన్ తాగ‌డం గురించి మాట్లాడుతూ.. యూరిన్ తాగ‌డం యోగా(Yoga)లో ఒక ముద్ర అని చెప్పుకొచ్చారు. యూరిన్ తాగడం వల్ల ముఖం మీద ముడతలు పోతాయని పేర్కొంది.

Bollywood Actress anu Agarwal reveals shocking facts she drink her own urine  pa| Anu Agarwal: ప్రతిరోజు నా మూత్రం నేను తాగుతా..!.. బాంబు పేల్చిన  బాలీవుడ్ నటి..News in Telugu

రెండింటిలో దేనిని నమ్ముతారు?

‘‘చాలా మందికి యూరిన్ తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలియదు. తెలిసినా నిర్లక్ష్యం వహిస్తున్నారో… లేదంటే అవగాహన లేదో తెలియ‌దు కాని యూరిన్ తాగ‌డాన్ని ఆమ్రోలి(Amroli) అంటారు. ఇది యోగాలో ఒక ముద్ర కాగా, దానిని నేను ప్రాక్టీస్ చేశాను. అది వ్యక్తిగతంగా, నాకు ఆరోగ్యప‌రంగా ఎంతో ప్రయోజనం చేకూర్చింది” అని చెప్పుకొచ్చింది. అయితే వైద్యులు(Doctors) తాగొద్దంటున్నారు క‌దా అని అడ‌గ్గా.. సైన్స్(Science) ఎప్పటిది? 200 ఏళ్లు? యోగా(Yoga) 1000 ఏళ్ల నుంచి ఉంది. మీరు రెండింటిలో దేనిని నమ్ముతారు అని తిరిగి ప్ర‌శ్నించిందీ సీనియర్ నటి.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

Pawan Kaiyan: భారీ ధరకు హరిహర వీరమల్లు ఓటీటీ డీల్!

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kaiyan) ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం జూలై 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *