టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరదా(Paradha)’. ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా స్త్రీ అస్తిత్వంపై ఆధారపడిన కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘టిల్లు స్క్వేర్(Tillu Squre)’ వంటి సూపర్ హిట్ తర్వాత అనుపమ ఈ సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో డీ-గ్లామర్ లుక్‌లో కనిపించనుంది. ఈ సినిమాలో దర్శనా రాజేంద్రన్(Darshana Rajendran), సంగీత (Sangeetha)వంటి నటీమణులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే డ్రామాతో రూపొందింది.
![]()
ఫ్యాన్సీ ధరకే ‘పరదా’ ఓటీటీ రైట్స్
కాగా ‘పరదా’ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైం వీడియో(Amazon Prime Video) ఫ్యాన్సీ రేట్‌కు దక్కించుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మహిళా కేంద్రిత కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అనుపమ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నుంచి థీమ్ ఆఫ్ పరదా ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా..’ అనే పాటను తాజాగా రిలీజ్ చేశారు. వనమాలి లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni) పాడారు. ఈ సాంగ్ సోషల్ మీడియా(SM)లో మంచి టాక్ తెచ్చుకుంది.
After 3 years of relentless dedication, passion, and countless sleepless nights of many our dream is finally becoming a reality — coming to theaters on August 22. This means the world to us. #Paradha pic.twitter.com/dmuy2UfWm3
— Praveen kandregula (@praveenfilms) July 17, 2025






