అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్లో వస్తున్న మూవీ ‘పరదా’ (Paradha). ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తున్నారు. ‘హృదయం’ మూవీ ఫేమ్ దర్శన (darshana rajendran), సీనియర్ నటి సంగీతతోపాటు రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ, పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. భిన్నమైన కథాంశంతో మూవీ రూపొందుతోంది.
గోపీ సుందర్ (Gopi Sundar) మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీపై అంచనాలు పెంచింది. ఆగస్టు 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి థీమ్ ఆఫ్ పరదా ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా..’ అనే పాటను తాజాగా రిలీజ్ చేశారు. వనమాలి లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి (anurag kulkarni) పాడారు. ఆకట్టుకుంటున్న ఈ థీమ్ సాంగ్‌ను మీరూ చూసేయండి.






