అనుష్క ఫస్ట్ లవ్ గురించి ఓపెన్‌ అయిందిగా.. చూసి ఆశ్చర్యపోవాల్సిందే!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన అనుష్క శెట్టి(Anushka  shetty), తన నటనతోనే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గాసిప్స్‌తో కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఆమె పేరుతో ఎఫైర్ పుకార్లు ఎన్నో వచ్చాయి. ముఖ్యంగా గోపీచంద్, ప్రభాస్, సెంథిల్ కుమార్ లాంటి సెలబ్రిటీలతో అనుష్కకు సంబంధం ఉందంటూ కథనాలు బాగా చక్కర్లు కొట్టాయి.

గతంలో గోపీచంద్‌(Gopichand)తో వరుస సినిమాలు చేసిన సమయంలో వీరి మధ్య ప్రత్యేక సంబంధం ఉందంటూ రూమర్లు వచ్చాయి. పెళ్లి చేసుకుంటారన్న మాటలతో హడావిడి అయినా, గోపీచంద్ వివాహంతో ఆ పుకార్లకు తెరపడింది. తరువాత అనుష్క ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌ను ప్రేమించిందన్న వార్తలు వినిపించాయి. కుటుంబాలూ అంగీకరించారంటూ ప్రచారం జరిగింది. కానీ సెంథిల్ పెళ్లికి అనుష్క హాజరవడంతో ఆ రూమర్లకు కూడా అంతమైంది.

అయితే ప్రభాస్‌(Prabhas)తో అనుష్క మధ్య ఉన్న అనుబంధం మాత్రం ఎక్కువగా ప్రజల్లో చర్చకు దారి తీసింది. ‘బాహుబలి'(Bahubali) సిరీస్‌ తరువాత వీరి పెళ్లి గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ ప్రభాస్ అన్ని సందర్భాల్లో అనుష్కను “నా బెస్ట్ ఫ్రెండ్”గా పేర్కొంటూ క్లారిటీ ఇచ్చేశాడు. అనుష్క మాత్రం వ్యక్తిగత విషయాలపై ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండిపోయింది.

ఇకపోతే, అనుష్క తన మొదటి ప్రేమ(First love) స్కూల్ డేస్‌లోనే ఎదురైందని తెలిపింది. ఆరవ తరగతిలో ఓ కుర్రాడు “ఐ లవ్ యూ” చెప్పగా, అర్థం కాకుండానే ఓకే చెప్పిందట. అదే తన తొలి లవ్ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.

తాజాగా ఆమె ‘ఘాటీ'(Ghati) అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రిష్(Krish) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుష్క ఫెరోషియస్ లుక్‌లో కనబడనుంది. ఆమె పాత్ర బలంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. జూలై(July 11) 11న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీకి పెద్ద స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారు. ‘ఘాటీ’తో అనుష్క మళ్లీ టాప్ ఫామ్‌లోకి వస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *