CM Chandrababu: తిరుమల లడ్డూ వివాదం.. సీఎం కీలక ఆదేశాలు

ManaEnadu: ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థాన(TTD) ప్రసాదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేశారని AP CM చంద్రబాబు(Chandrababu) ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సీఎం కల్తీ వివాదం అంశాన్ని చాలా సీరియస్‌(Serious)గా తీసుకున్నారు. మరోవైపు లడ్డూ ప్రసాదం(Laddu prasadam) కల్తీ చేశారన్న వార్తతో కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి(Ghee)లో అనేక కల్తీలు జరిగాయన్న అంశం తీవ్ర దుమారం రేపింది. తిరుమలలో జరిగిన అపచారంపై ప్రపంచవ్యాప్తంగా భక్తులు(devotees) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం అంటున్నారు. తిరుపతి లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు(Quality defects) ఉన్నాయని, అపవిత్ర పదార్థాలు వాడారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

 సమగ్ర వివరాలతో ఘటనపై విచారణ

ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష(High level review) నిర్వహించారు. సమగ్ర వివరాలతో ఘటనపై వివరణ ఇవ్వాలని TTD EO శ్యామలరావుని ఆదేశించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై వైదిక, ధార్మిక పరిషత్తుల్లో చర్చించి కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న CM చంద్రబాబు లడ్డూ వివాదంపై రివ్యూ నిర్వహించారు. CS నీరబ్ కుమార్, పలువురు ఉన్నతాధికారులతో పాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

 ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి: రాహుల్ గాంధీ

తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) స్పందించారు. ప్రసాదం నాణ్యతపై వస్తున్న విమర్శలు కలకలం రేపుతున్నాయని అన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ‘బాలాజీ(Balaji)’ ఆరాధ్య దేవుడు. ఈ ఆరోపణలు ప్రతి ఒక్క భక్తుడిని బాధిస్తున్నాయి. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరముంది. మన దేశంలోని మతపరమైన ప్రదేశాల పవిత్రతను అధికారులు కాపాడాలి’ అని Xలో ట్వీట్ చేశారు. మరోవైపు తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనతో ఏపీ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యత వివరాలను సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీస్తోంది. దీనిపై త్వరలోనే విధివిధానాలను ఖరారు చేసే యోచనలో దేవదాయశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.

Share post:

లేటెస్ట్