
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు (AP Budget Sessions 3035) ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (AP Governor Speech) ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభ, శాసన మండలి వ్యవహారాల సలహా కమిటీలు భేటీ అయి.. సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై చర్చిస్తారు. మరోవైపు ఈ నెల 28వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మార్చి 3వ తేదీ నుంచి బడ్జెట్ సహా అనేక అంశాలపై చర్చ జరగనుంది.
జగన్ వాకౌట్
గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే శాసనసభలో వైఎస్సార్సీపీ (YSRCP) సభ్యులు నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుంచి మాజీ సీఎం జగన్ (YS Jagan Walked Out), వైఎస్సార్సీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. సభలో 10 నిమిషాలు నినాదాలు చేసి సభ నుంచి వాకౌట్ చేశారు.
KCR : ‘తెలంగాణలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం’
‘నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది.’ ఓ సినిమాలో తలైవా రజినీ కాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పుడు అచ్చం ఇదే డైలాగ్ ను కాస్త అటూ ఇటూగా మార్చి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…