
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రెండ్రోజుల క్రితమే ఆయన అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా పవన్.. తీవ్రమైన నడుమునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రోజున నిర్వహించిన సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కాలేదు.
పవన్‌కు నడుమునొప్పి
పవన్ రెండు వారాలుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని, అందుకే సమావేశానికి రాలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబుకు తెలిపారు. రెండు మూడు రోజుల్లో విధులకు హాజరవుతారని నాదెండ్ల చెప్పారు. దానికి ముఖ్యమంత్రి స్పందిస్తూ… ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించానని, దొరకలేదని అన్నారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై నాదెండ్లను ఆరా తీశారు.