Mana Enadu: ఏపీ(Andhra pradesh)లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడనుంది. ఎన్నిరోజులుగా నిరుద్యోగులు ఎదురుచూస్తోన్న మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్(Mega DSC 2024 Notification) త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ(School Education Department) కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారం(November First week)లో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడు, నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తోంది.
మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
నవంబరు 3వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం(State Govt) ప్రకటించింది. ఈ DSC ప్రకటన ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే కూటమి సర్కార్ ప్రకటించింది. మెగా డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్ టీచర్ (SA) పోస్టులు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) పోస్టులు1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) పోస్టులు 286, ప్రిన్సిపాల్ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయుల (PET) పోస్టులు 132 వరకు ఉన్నాయి. దీంతో విద్యార్థులు DSC కోచింగ్ తీసుకునేందుకు ఆ సక్తి చూపుతున్నారు.
వారికి ఫ్రీ కోచింగ్
అయితే భారీగా డబ్బులు కట్టి కోచింగ్ తీసుకోలేని వారికోసం సాంఘిక సంక్షేమ శాఖ(Social welfare) గుడ్ న్యూస్ తెలిపింది. కుటుంబ ఆదాయం రూ. 2.50 కంటే తక్కువ ఉన్నవారు.. మెగా డీఎస్సీకి అర్హత సాధించిన వారికి ఉచిత కోచింగ్(Free coaching) ఇవ్వనుంది. అర్హత సాధించిన అభ్యర్థులకు మూడు నెలలు అన్ని వసతులతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీని కోసం ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరింది.