ఏపీలో కూటమి సర్కార్(Alliance Govt in AP) అధికారంలోకి వచ్చింది మొదలు అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమానికి(Welfare) పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోంది. మరోవైపు విపక్షంలో ఉన్న YCP బురద జల్లేందుకు ఎప్పటికప్పుడు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయినా కూటమి గవర్నమెంట్ సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఎన్నికల(Elections) సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇక తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దివ్యాంగులకు(For the disabled) ఫ్రీగా స్కూటీ(Free Scooty) అందించాలని భావిస్తోంది.
వందశాతం రాయితీతో..
ఈ మేరకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశాల మేరకు ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖకు నివేదించారు. బడ్జెట్(Budget) నుంచి నిధులు విడుదలైన వెంటనే 100% రాయితీతో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు(Three wheeler Vehicles) అందించేందుకు తదుపరి చర్యలు చేపట్టబోతున్నారు. 2024-25 ఏడాదికి గాను.. నియోజకవర్గానికి 10మంది చొప్పున 1750 మంది దివ్యాంగులకు ఈ వాహనాలు ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ ద్వారా లబ్ధిదారుల(Beneficiaries)ను ఎంపిక చేసి వాహనాల పంపిణీ షురూ చేస్తారు. ఒక్కో వాహనం ధర రూ. లక్ష ఉంటుందని అంచనా. దీంతో మొత్తం వాహనాల పంపిణీకి రూ.17.50 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అర్హతలు ఇవే
☛ డిగ్రీ(Degree) లేదా అంతకంటే ఎక్కువ అర్హతలు ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఉంటుంది.
☛ కనీసం ఒక సంవత్సరం పాటు స్వయం ఉపాధిలో నిమగ్నమైన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
☛ 70% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం(disability) ఉన్న దరఖాస్తుకు అర్హులు.
☛ 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి .
☛ కుటుంబ వార్షిక ఆదాయం(Family Income) ₹3,00,000 మించకూడదు.
☛ ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తోంది.
☛ 4 నెలల్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తారు.
☛ దరఖాస్తులను ఆన్లైన్(Online)లో లేదా గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా సమర్పించవచ్చు.






