ManaEnadu: కలియుగ దైవం, ఏడుకొండల వేంకటేశ్వరస్వామి(Venkateswara Swamy) లడ్డూ ప్రసాదం(Laddoo Prasadam) కల్తీ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే(CM Chandrababu) శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని ఆరోపించడంతో హిందువులు(Hindus) ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) తాజాగా మరోసారి స్పందించారు. ‘‘అమృతతుల్యంగా.. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం – గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాల(Animal remains)తో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం’’ అని పవన్ ట్వీట్(Tweet) చేశారు.
ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే: పవన్
‘‘లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు(animal fat) ఉందని తెలిసిన క్షణం.. నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీ(Balaji)కి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మా(Sanatana Dharma)న్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను “ప్రాయశ్చిత్త దీక్ష” చేయాలని సంకల్పించాను. 22 SEP 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరు(Namburu)లోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా.. నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వు’’ అని పవన్ ఆవేదనతో కూడిన వ్యాఖ్య జతచేశారు.
ధర్మాన్ని పునరుద్ధరించేందుకు సమయం ఆసన్నమైంది..
అలాగే ‘‘భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే – తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు(Board members), ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాల(Vedacharas)కు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యి(Ghee)ని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షతి రక్షితః’’ అని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఏడుకొండలవాడా..! క్షమించు
•11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం…— Pawan Kalyan (@PawanKalyan) September 21, 2024