అమరావతి:
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినిపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినిపించారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని, కస్టడీకి అనుమతించాలని ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు 12కు వాయిదా వేసింది. అప్పటివరకు అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశించింది.
నారాయణ పిటిషన్ మరో బెంచ్‌కు మార్పు
ఏపీ మాజీ మంత్రి నారాయణకు అందిన 41ఏ నోటీసులపై విచారణను హైకోర్టు మరో బెంచ్‌కు మార్చింది. తమ బెంచ్ వద్దకు వచ్చిన ఈ పిటిషన్‌పై తాను విచారణ చేపట్టబోనని జస్టిస్ శ్రీనివాసరెడ్డి పేర్కొనడంతో మరో బెంచ్‌కు బదిలీ చేశారు. విచారణకు రావాలని రెండు రోజులపాటు నారాయణపై ఒత్తిడి చేయవద్దని సీఐడీని ఆదేశించారు.