ManaEnadu: తిరుమల లడ్డూ(Tirumala Laddu) వ్యవహారం చిలికిచికలి గాలి వానలా మారుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపైనే చర్చ నడుస్తోంది. అటు APలో అయితే రాజకీయంగా పెను దుమారాన్నే రేపుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్(Dialogue War) నడుస్తోంది. సాక్షాత్తూ ఆ తిరుమలేశుడి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని స్వయంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆరోపించడంతో దీనిపై వివాదం చెలరేగింది. దీంతో YCP నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు 100 రోజుల పాలనపై దృష్టి పెట్టకుండా.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ(forgery) జరిగిందని డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశాడంటూ రివర్స్ అటాక్ చేస్తోంది YCP. ఇంతకీ రెండు పార్టీల మధ్య పంతం సంగతి సరే.. ఇంతకీ నిజంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందా? అని హిందువులందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో AP మాజీ సీఎం, YCP అధినేత జగన్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. లడ్డూ ప్రసాదం కల్తీ జరగలేదని స్పష్టం చేశారు.
వంద రోజుల పాలన అంతా మాయే: జగన్
జగన్ (YS Jagan) మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఎన్నికలు జరిగినప్పటి నుంచి చంద్రబాబు ప్రజలను చూసి.. నీకు 15 వేలు, నీకు 18 వేలు, నీకు 40 వేలు అని చెప్పి.. ప్రజల జీవితాలతో చెలగాటమాడారని జగన్ విమర్శించారు. చంద్రబాబుది వంద రోజుల పాలన(Hundred days rule) కాదని, 100 రోజుల మోసం అని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్(Super Six) లేదు, సూపర్ 7 లేదు.. అంతా మాయేనని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్వమయ్యాయని, ఇంగ్లిష్ మీడియం(English medium) చదువులు అటకెక్కాయని, గోరుముద్ద కూడా గాలికి ఎగిరిపోయిందన్నారు. ప్రభుత్వ సిబ్బందికి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇంతవరకూ జీతాలు(Salaries) లేవన్నారు. చంద్రబాబు హయాంలో రైతు రోడ్డున పడ్డాడని వాపోయారు. విజయవాడ వరదలు(Flods) కూడా చంద్రబాబు ప్రభుత్వ అలసత్వమే అని జగన్ విమర్శించారు.
దేవుడిని కూడా తన స్వార్థానికి వాడుకుంటున్నారు..
దేవుడిని కూడా తన స్వార్థానికి(selfishness) వాడుకునే చంద్రబాబు లాంటి దుర్మార్గమైన వ్యక్తి ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా ఉండడని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. అతి దుర్మార్గంగా లడ్డూ రాజకీయాలు(Laddu politics) చేస్తున్నారని ఆయన విమర్శించారు. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి(Ghee)కి బదులుగా జంతువుతో చేసిన ఫ్యాట్(Fat) ను వాడారని ఆయన చేసిన ఆరోపణలు ధర్మమేనా? అని ప్రశ్నించారు. తిరుమలలో ప్రతి 6 నెలలకు ఒకసారి నెయ్యికి టెండర్లు(tenders) పిలుస్తారని, ఇది చాలా సాధారణమైన విషయం అన్నారు. లడ్డూ తయారీలో వాడే పదార్థాలు కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాయని, ఆరునెలల్లో ఎవరు L1గా వస్తారో వారికే ఇస్తారని తెలిపారు. లడ్డూ తయారీకి వాడే పదార్థాలకు క్వాలిటీ టెస్టులు(Quality tests) మూడు దశల్లో జరుగుతాయని, అవన్నీ పాసయ్యాకే లడ్డూ తయారీకి వాడే పదార్థాలు ముందుకు పంపిస్తారని జగన్ తెలిపారు.
LIVE: YSRCP Chief @YSJagan PressMeet https://t.co/NSWkt4kfHS
— YSR Congress Party (@YSRCParty) September 20, 2024
2నెలలుగా లడ్డూ కల్తీపై ఎందుకు చెప్పలేదు..
జులై 12న శాంపిల్స్(samples) తీసుకున్నారంటే కూటమి ప్రభుత్వ హయాంలోనే తీసుకున్నట్లేనన్నారు. వాటిలో కల్తీ ఉందని రావడంతో వాళ్లు జులై 23న రిపోర్ట్(Report) ఇచ్చారన్నారు. అప్పటి నుంచి CM చంద్రబాబు 2నెలలుగా లడ్డూ కల్తీ గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇప్పుడు 100 రోజుల పాలనపై ప్రజలు హామీల గురించి ప్రశ్నిస్తుంటే ఆ రిపోర్టును ఇప్పుడు వాడుకుని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. లడ్డూలో కల్తీ జరిగిందని భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, మన గుడిని, మన దేవుడిని అభాసుపాలు చేసుకున్నామన్నారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన రాజకీయాలను PM మోడీకి, సుప్రీంకోర్టు CJIకి లేఖ(Letter) రాస్తానని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలని ఆ లేఖలో కోరుతానని జగన్ పేర్కొన్నారు.