
ఏపీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Sessions 2025) రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. ఈ సందర్భంగా సమావేశాల మొదటి రోజైన సోమవారం నాడు అసెంబ్లీలో వైస్సార్సీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైస్సార్సీపీ (YSRCP) సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదని హితవు పలికారు.
జగన్ విజ్ఞతతో వ్యవహరించాలి
‘రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి (వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)ని ఉద్దేశిస్తూ) సభ్యత మరిచి ప్రవర్తించారు. తన పార్టీ సభ్యుల తీరును నియంత్రించాల్సింది పోయి ఆయన కూడా వాళ్లతో కలిసి కూర్చుని నవ్వుకుంటారా? రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి వీల్లేదు. ఇకనైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలి. సభా మర్యాదను అందరు సభ్యులు కాపాడాలి.’ అని స్పీకర్ (AP Assembly Speaker) అయ్యన్నపాత్రుడు సూచించారు.