Mana Enadu : ఏపీ టెట్ ప్రిలిమినరీ పరీక్షలు(AP TET Prelimis 2024) అక్టోబర్ 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు విజయవంతంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెట్ ప్రిలిమ్స్ కీ (AP TET Preliminary Key) తాజాగా విద్యాశాఖ విడుదల చేసింది. అన్ని పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ కీలను అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
అక్టోబర్ 18వరకు అభ్యంతరాలు
పేపర్ 1A, 1B పరీక్ష ప్రాథమిక కీకి సంబంధించి అక్టోబర్ 18వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రశ్నపత్రాలు, కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరోవైపు మిగిలిన పరీక్షల ప్రశ్నా పత్రాలు, కీలను ఆయా పరీక్షలు జరిగిన తర్వాతి రోజుల్లో విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
నవంబర్ 2న ఫలితాలు
సీబీటీ విధానం (TET CBT 2024)లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 27వ తేదీన ఫైనల్ కీ, నవంబర్ 2వ తేదీన ఫలితాల విడుదల చేయనున్నారు. ఏపీ టెట్‌కు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
ఏపీ వ్యాప్తంగా 108 టెట్ పరీక్షా కేంద్రాలు