
మొబైల్ లవర్స్‌కు వాలంటైన్స్ డే సందర్భంగా ఆపిల్ సంస్థ(Apple Company) శుభవార్త చెప్పింది. టెక్ ప్రియులు ఎన్నోరోజులుగా ఎదురు చూస్తోన్న ఐఫోన్ ఎస్ఈ4((iPhone SE4))ను ఈనెల 19న మార్కెట్లలోకి విడుదల చేయనున్నట్లు ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్(Apple CEO Tim Cook) ట్విటర్ (X)వేదికగా తెలిపారు. ఈ మేరకు సిల్వర్ కలర్(Silver)లో మెరిసే యాపిల్ లోగో(Apple Logo)ను ఆయన షేర్ చేశారు. అయితే ప్రొడక్ట్‌కు సంబంధించి ఆయన ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఈ(iPhone SE) సిరీస్‌కు స్పెషల్‌గా అభిమనులు ఉన్నారు. కాగా 2022లో చివరిసారిగా SE Modelను లాంచ్ చేయగా, దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ కొత్త వర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది ఆపిల్.
#Apple Teases New Product Launch Next Week!
Apple CEO Tim Cook has set the tech world abuzz with a cryptic teaser!
🔹 Launch Date: Wednesday, February 19
🔹 Tim Cook’s Message: “Get ready to meet the newest member of the family.”
Speculation is rife—could this be the… pic.twitter.com/PyXOHTio8Z
— The Asian Chronicle (@AsianChronicle) February 14, 2025
ఈ ఫీచర్స్ ఉండే అవకాశం
కాగా, ఐఫోన్ ఎస్ఈ 4 ధర కూడా తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. బేస్ వేరియంట్‌ను సుమారు ₹43,900ధరలో అందించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. అలాగే ఇందులో ఐఫోన్ 14 తరహాలో హోమ్ బటన్,టచ్ ఐడీ లేకుండా ఫేస్ ఐడీ ఫీచర్‌తో లాంచ్ అయ్యే ఛాన్సుందట. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్, USB-C పోర్ట్, A18 చిప్‌సెట్‌తో మరింత శక్తివంతమైన పనితీరు అందించేలా ఫీచర్స్ సెట్ చేసినట్లు సమాచారం. ఆ సంస్థ తాజా ప్రకటనతో టెక్ లవర్స్ తెగ సంబరపడిపోతున్నారు.