
గద్దర్ అవార్డుల(Gaddar Awards-2025)కు సంబంధించి తెలంగాణ ఫిల్మ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ, ఎంట్రీ ఫీజు(Entry Fee) వివరాలను వెల్లడించింది. ఇవాళ (మార్చి 20) మధ్యాహ్నం 3 గంటల నుంచి అప్లికేషన్స్ (Applications) స్వీకరిస్తామని తెలిపింది. ఈ ప్రక్రియ ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ కొనసాగుతుందని పేర్కొంది.
కాగా ఫీచర్ ఫిల్మ్(Feature Film), డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, బుక్స్-క్రిటిక్స్ విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ‘ది మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ పేరిట చెక్ లేదా DD ద్వారా నిర్ణీత రుసుము చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు ఎంట్రీ ఫీజులను కూడా ఖరారు చేసింది.
ఎంట్రీ, దరఖాస్తు ఫీజు వివరాలు ఇలా
ఎంట్రీ, దరఖాస్తు రుసుం వివరాలు ఇలా ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ ఫీజు రూ.11,800, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ రూ.3,450, బుక్స్ అండ్ క్రిటిక్స్ రూ. 2,360, అన్ని విభాగాల్లో అప్లికేషన్లకు ఫీజు GSTతో కలిపి రూ.5,900గా నిర్ణయించింది. పైన పేర్కొన్న అన్ని కేటగిరీల ఎంట్రీ ఫీజులు జీఎస్టీతో కలిపి ఉంటాయని స్పష్టం చేసింది.