
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ (Kiara Advani) నటించిన లేటెస్ట్ సినిమా ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత కలెక్షన్ల పరంగా నిరాశ పరిచింది. తమిళ్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోవడంలో విఫలమైంది.
గేమ్ ఛేంజర్ కు షాక్
ఇక ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ గేమ్ ఛేంజర్ (Game Changer) స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రబృందంపై పోలీస్ స్టేషన్ లో ఓ ఫిర్యాదు నమోదైంది. గేమ్ ఛేంజర్ చిత్రబృందం తమను మోసం చేసిందని పలువురు ఆర్టిస్టులు గుంటూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ చిత్ర షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుంచి 350 మంది ఆర్టిస్టులను హైదరాబాద్ కు తీసుకెళ్లారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాంచరణ్ గేమ్ ఛేంజర్ సినిమా టీం తమను మోసం చేసిందని పోలీస్ స్టేషన్లో ఆర్టిస్టుల ఫిర్యాదు
గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుండి హైదరాబాద్ కి 350 మంది వెళ్లామని, కో డైరెక్టర్ స్వర్గం శివ తమకు రూ.1200 ఇస్తానని ఒప్పుకొని డబ్బులు ఇవ్వట్లేదని గుంటూరు పోలీస్ స్టేషన్లో… pic.twitter.com/39etzw3mTb
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2025
దిల్ రాజు న్యాయం చేయాలి
గేమ్ ఛేంజర్ సినిమా కో డైరెక్టర్ స్వర్గం శివ.. హైదరాబాద్ వెళ్లిన ఆర్టిస్టులకు ఒక్కొక్కరికి రూ.1200 చొప్పున ఇస్తానని ఒప్పుకుని ఇప్పుడు డబ్బులు ఇవ్వడం లేదని వారు ఫిర్యాదు చేశారు. సినీ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తమను మోసం చేసిన స్వర్గం శివపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రస్తుతం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది.