
ప్రస్తుతం ప్రపంచాన్ని టెక్నాలజీ(Technology) తన గుప్పిట్లోకి తీసుకుంది. ఈ డిజిటల్ ఎర(Digital Era)లో సెల్‌ఫోన్ అత్యంత విలువైన వస్తువుగా మారిపోయింది. ఇంటర్నెట్(Internet) ఉంటే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో వైరల్(Viral) అయిపోతుంది. తాజాగా అలాంటి ఘటనే సోషల్ మీడియా(SM)లో తెగ వైరల్ అవుతోంది. అప్పుడప్పుడు ఇంటర్నెట్‌లో రకరకాల ఛాలెంజ్‌లు వైరల్ అవుతుంటాయి. కొందరు ఫన్నీ ఛాలెంజ్‌లు చేస్తుంటే.. మరికొందరు తమ ఓపిక, పట్టుదలను పరీక్షించే అసాధారణమైన సాహసాలను చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ ఆస్ట్రేలియన్ యూట్యూబర్ ‘నార్మే(Norme)’ ఏకంగా 38 గంటలు కదలకుండా నిలబడి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
డిస్టర్బ్ చేయడానికి ఎంత మంది ప్రయత్నించినా..
నార్మే చేసిన ఈ సాహసం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. 38 గంటల పాటు ఆయన ఒక్క అంగుళం కూడా కదలకుండా నిలబడి సరికొత్త రికార్డ్(Record) నెలకొల్పాడు. ఇది సాధారణమైన పని కాదు. అంతసేపు శరీరాన్ని స్థిరంగా ఉంచడం చాలా కష్టం. అయినప్పటికీ, తన అద్భుతమైన సెల్ఫ్ కంట్రోల్(Self control)తో నార్మే ఈ రికార్డును సాధించాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో నార్మే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాడు. అతన్ని డిస్టర్బ్ చేయడానికి కొంతమంది ఫాలోవర్లు(Followers) సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ మెసేజ్‌లు పంపించారు.
WAS SO MAD THAT THEY PUT A MAGA HAT ON ME GRRR 😤😡😡 .. even madder the cop stole it tho https://t.co/TZgiLM96qn
— NORME (@NormeNorme) March 9, 2025
నెటిజన్ల నుంచి భిన్నస్పందన
అంతేకాదు కొందరు అతని స్థితిని గమనించి పోలీసులకు ఫోన్ చేసి అలర్ట్ చేశారు. అయినప్పటికీ, నార్మే అస్సలు డిస్టర్బ్ కాలేదు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఒక విగ్రహంలా నిలబడి రికార్డును సృష్టించాడు. ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఏమీ చేయకపోవడమే ఒక్కోసారి పెద్ద ఛాలెంజ్. ఇది కేవలం శరీరానికే కాకుండా, మనసుకు కూడా పరీక్ష. అంతసేపు కదలకుండా నిలబడి ఉండటం కోసం బాడీని, మైండ్‌ను ప్రత్యేకంగా ట్రైన్ చేసుకోవాలని చెప్పుకొచ్చాడు నార్మే. అయితే ఇతడిని కొందరు మెచ్చుకుంటుంటే.. మరి కొందరు ఇదేం వెర్రి అంటూ విమర్శిస్తున్నారు.