ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య (Ayodhya) రామ మందిరానికి బాంబు బెదిరింపులు (Bomb threats) రావటం కలకలం సృష్టించింది. రామమందిరాన్ని పేల్చేస్తామంటూ కలెక్టరేట్లకు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న CCTVలను సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే, ఈ మేరకు అయోధ్య సైబర్ క్రైమ్ PSలో కేసు నమోదు చేశారు. కాగా తమిళనాడు(Tamilnadu) నుంచి ఇంగ్లిష్‌లో మెయిల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆ మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
The Ram Temple trust has received a bomb threat mail, warning about a security threat to the Ram Temple in Uttar Pradesh’s Ayodhya, which was inaugurated in January last year.
The warning was received in the mail of Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust, the body which… pic.twitter.com/WsxBhGCufN
— IndiaToday (@IndiaToday) April 15, 2025
డ్రోన్ నిఘాలోకి రామమందిరం
అయితే, అయోధ్య రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. రామ మందిరాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ ఖలీస్థానీ(Khalistani) ఉగ్రవాది పన్నూ బెదిరించాడు. తరచూ ఈ తరహా ఉగ్ర ముప్పుల దృష్ట్యా అయోధ్య నగరంలోనూ, రామాలయ పరిసర ప్రాంతాల్లోనూ అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు మొత్తం ప్రాంతాన్ని డ్రోన్ నిఘా(Drone Surveillance)లోకి తీసుకొచ్చారు.
అలర్టైన కేంద్ర హోంశాఖ
ఇదిలా ఉండగా ఇటీవల ముంబై దాడుల ప్రధాన సూత్రధారి తహవూర్ రాణా(Tahavor Rana)ను భారత్ అరెస్టు చేసిన నేపథ్యంలో దేశంలో దాడులకు అవకాశం ఉందని నిఘా వర్గాలు(Intelligence Agencies) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్యకు బెదిరింపులు రావడం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. దీంతో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయింది. దేశంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు, ఆలయాలు, పుణ్యక్షేత్రాల వద్ద నిఘా పెంచాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.
अयोध्या -राम मंदिर को बम से उड़ाने की धमकी, बढ़ाई गई सुरक्षा, कल राम जन्मभूमि ट्रस्ट के ईमेल पर धमकी मिली थी
साइबर सेल में धमकी के मामले में मुकदमा दर्ज कराया, राम जन्मभूमि परिसर,आसपास के इलाकों में पुलिस मौजूद, सुरक्षा बलों की तैनाती और गश्त को भी बढ़ा दिया गया है#Ayodhya… pic.twitter.com/muIGesErjg
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) April 15, 2025






