అఖండ-2 అప్డేట్.. ఫస్ట్ సీన్​లోనే బాలయ్య క్రేజీ ఫైట్

Mana Enadu : సింహా, లెజెండ్(Legend), అఖండ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న మూవీ ‘అఖండ 2(AKhanda 2)’. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్​గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే.  షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న అప్డేట్ ఈ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. ఇంతకీ అదేంటంటే?

అమెరికాలో అఖండ-2 షూటింగ్

అఖండ-2 సినిమా స్టార్టింగ్ సీక్వెన్స్ గురించి నెట్టింట ఓ అప్డేట్ బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓపెనింగ్ సీన్ ను యూఎస్ లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అంది కూడా మూవీ ఓపెనింగ్ సీన్ లో బాలయ్య(Balakrishna Akhanda 2) సూపర్ యాక్షన్ చూపించనున్నాడట. అదేనండి.. మాంచి ఫైట్ తో ఈ చిత్రం ఓపెనింగ్ షాట్ ఉండనుందట. ఈ సీన్ షూటింగ్ కోసం బాలయ్య అమెరికా వెళ్లనున్నారట. అక్కడ తెలుగు వాళ్లపై దాడి జరిగే క్రమంలో బాలయ్య పాత్ర వారిని సేవ్ చేయడానికి ఈ ఫైట్ చేస్తారని టాక్ నడుస్తోంది. 

అఖండ2లో బాలీవుడ్ స్టార్

ఇక ‘అఖండ 2’ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dutt) కూడా ఓ కీలక పాత్రలో నటించనునన్నట్లు సమాచారం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను  బాలయ్య రెండో కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. 

గూస్ బంప్స్ తెప్పించే మ్యూజిక్

ఇక ఈ సినిమా పూజా కార్యక్రమం పూర్తైన కాసేపటికే​ ‘అఖండ 2’ టైటిల్ థీమ్​ను రిలీజ్ చేశారు. ఈ టైటిల్ థీమ్​కు తమన్(SS Thaman Music) సెన్సేషనల్ మ్యూజిక్ అందించారు. గూస్ బంప్స్ తెప్పించేలా ఈ మ్యూజిక్ ఉంది. ఇదే ఇలా ఉందంటే.. ఇక సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజులో ఉంటుందోనంటూ.. ఇక థియేటర్స్ లో పూనకాలే అంటూ బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.

Share post:

లేటెస్ట్