శివాజీని బ‌య‌ట‌కు పంపిన బిగ్‌బాస్‌..ట్విస్ట్ ఇక్క‌డే

నామినేషన్ ప్ర‌క్రీయ ర‌చ్చ‌ రచ్చ అయింది. హౌస్లో ఉండేందుకు అర్హత లేని వారిని నామినేట్ చేయండని బిగ్ బాస్ హౌస్‌ సభ్యులకు సూచించాడు. ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా మారింది. ప్రశాంత్, సందీప్ అశ్విని, అమర్ మధ్య డిస్క‌ష‌న్‌ గట్టిగానే జరిగింది

బిగ్‌ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే నామినేషన్స్ టీజ‌ర్ రానే వచ్చేసింది. గత వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ రావడంతో ఇంటి సభ్యుల మధ్య గట్టి పోటీ మొదలైంది. ఆటగాళ్లు, పోటుగాళ్ళు గా ఇంటి సభ్యులను వేరు చేసిన బిగ్ బాస్.. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో అందరు ఒకటే అని చెప్పాడు. ఇంట్లో ఉండటానికి అర్హత లేని వారిని నామినేట్ చేయండి అంటూ బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెప్పాడు. ఇక ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా జరిగినట్లు కనిపిస్తుంది. ప్రశాంత్, సందీప్ అశ్విని, అమర్ మధ్య ఆర్గుమెంట్స్ గట్టిగానే జరిగాయి.

ప్రశాంత్ VS సందీప్

రైతు బిడ్డ ప్రశాంత్ సందీప్ ను నామినేట్ చేస్తూ.. నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు మీరు నా కెప్టెన్సీ కి విలువ ఇవ్వకుండా, నా అనుమతి లేకుండానే విప్ రూంలోకి వచ్చారు అది నాకు నచ్చలేదు అంటూ సందీప్ ను నామినేట్ చేశాడు. దానికి సందీప్ చెప్పే సమాధానం ప్రశాంత్ వినకపోవడంతో సందీప్ మాటకు మాట మాట్లాడితే తప్పును
కప్పిపుచ్చుకోవడం అంటారు అంటూ ప్రశాంత్ కి బదులిచ్చాడు.

కన్ఫ్యూజన్ లో అశ్విని

అమరదీప్ అశ్విని నామినేట్ చేస్తూ.. మీరు నన్ను 5 వారాలు ఉన్నారు కదా ఇక చాలు అనడం నచ్చలేదు అని చెప్పాడు. దానికి అశ్విని నేను ఆ ఉద్దేశంతో అనలేదు.. నాకు నీ పై ఎలాంటి ఈగో లేదు.. అంటూ సమాధానమిచ్చింది. పాపం అశ్విని తను అమర్ కు సమాధానం చెప్పిన ప్రతిసారి అమర్ పేరు బదులు ప్రశాంత్ అని పిలవడం నచ్చని అమర్ కోపంతో ప్రశాంత్ నువ్వు వచ్చి నిలబడు ఇక్కడ ఊరికే నీ పేరే పిలుస్తుంది అంటూ కొప్పడ్డాడు

శివాజీ అవుట్

ప్రోమోలో చూపిన ప్రకారం శివాజీ ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి వచ్చిన శివాజీ ..గేట్స్ ఓపెన్ చేయగానే శివాజీ బయటకు వెళ్ళాడు. శివాజీ వెళ్లడంతో రైతు బిడ్డ, హౌస్ మేట్స్ అందరు కన్నీళ్లు పెట్టుకున్నారు.

 

 

 

Share post:

లేటెస్ట్