మనీష్‌ మల్హోత్రా ‘దీపావళి పార్టీ’లో బాలీవుడ్ బ్యూటీస్.. ఫొటోస్ వైరల్

Mana Enadu : బాలీవుడ్​లో తరచూ పార్టీలు జరుగుతుంటాయి. సినిమా హిట్ అయినా పార్టీయే.. పండుగలొచ్చినా పార్టీయే.. ఎవరైనా ఏదైనా బిజినెస్ వెంచర్ షురూ చేసినా పార్టీయే.. బోర్ కొట్టినా సరే పార్టీయే. తరచూ జరిగే ఈ పార్టీలో బీ టౌన్ తారలు (Bollywood Heroines) అల్ట్రా స్టైలిష్ ఔట్​ ఫిట్స్​లో సందడి చేస్తుంటారు. ఇక పాపరాజీ వాళ్ల ఫొటోల కోసం తెగ ఆసక్తి చూపిస్తుంటుంది. బాలీవుడ్ పార్టీలంటేనే సూపర్ కలర్ ఫుల్ పార్టీస్. ఈ పార్టీల్లో తారలు స్పెషల్ అట్రాక్షన్​గా నిలుస్తుంటారు.

మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీ

ఇక మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ వస్తున్న విషయం తెలిసిందే. దీపావళి అంటే బీ టౌన్​లో పార్టీల సీజన్. ఈ పండుగ పురస్కరించుకుని పలువురు ప్రముఖులు పార్టీలు హోస్టు చేస్తుంటారు. ఈ జాబితాలో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా (Manish Malhotra) ముందుంటారు. ప్రతి దీపావళికి మనీష్ మల్హోత్రా పార్టీ హోస్టు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన దీపావళి పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు బాలీవుడ్ తారలు విచ్చేసి సందడి చేశారు. ముఖ్యంగా బీ టౌన్ బ్యూటీస్ కలర్ ఫుల్ ఔట్ ఫిట్స్​లో మెరిసిపోయారు.

స్పెషల్ అట్రాక్షన్​గా జాన్వీ

మనీష్ మల్హోత్రీ దీపావళి పార్టీలో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది బీ టౌన్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor). స్టైలిష్ శారీలో ఈ భామ అల్ట్రా పోష్ లుక్​లో అదరగొట్టింది. ఎప్పటిలాగే జాన్వీ ఈ పార్టీలోనూ అందరి కళ్లు తనవైపే తిరిగేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక జాన్వీతో పాటు బాలీవుడ్ భామలు శ్రద్ధా కపూర్, అనన్యా పాండే(Ananya Pandey) కూడా చీరల్లో మెరిశారు. ఈ ఇద్దరూ వైట్ కలర్ శారీలో చాలా అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

ఈవెంట్ ఏదైనా మనీష్ డిజైన్ ఉండాల్సిందే

ఇక మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో నటి శోభితా ధూళిపాళ, కాజోల్ ముఖర్జీ, తమన్నా భాటియా, జెనీలియా, రితేశ్ దేశ్​ముఖ్, దిశా పటానీ(Disha Patani), కరణ్ జోహార్, ఆలియా భట్ సందడి చేశారు. వీరు డిజైనర్ ఔట్​ ఫిట్స్​లో ట్రెడిషనల్ లుక్స్​లో మెరిసిపోయారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మనీష్ మల్హోత్రా అనేక బ్లాక్‌బస్టర్ బాలీవుడ్‌ సినిమాలకు డిజైన్‌ చేశారు. మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన బాలీవుడ్‌లో దిగ్గజ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పేరు గాంచారు. ఏ సినీ వేడుకకు అయినా తారలంతా మనీష్‌ డిజైన్‌ చేసిన దుస్తులే ధరిస్తారన్న విషయం తెలిసిందే.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *