KTR Tweet: కమీషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు చేస్తున్నారా? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Mana Enadu: తెలంగాణ(Telanagana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR ధ్వజమెత్తారు. CMగా రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కిన రోజు నుంచి తెచ్చిన మొత్తం అప్పులు రూ.80,500 కోట్లు అని అన్నారు. తెలంగాణలో 10నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పుల్లో ఇదే తొలిసారి రికార్డ్ అని ఆయన పేర్కొన్నారు. అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి? అని ట్విటర్ (X) వేదికగా నిప్పులు చెరిగారు.

కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా?

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి KTR విమర్శల వర్షం కురిపించారు. ‘‘ఎన్నికల సమయంలో BRS ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను నిలువునా ముంచిందని చెప్పిన రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఇప్పుడు దేనితో కొట్టాలి’’ అని అన్నారు. ఎన్నికల సమయం(Election Time)లో ఇచ్చిన హమీలేవీ తీర్చలేదని మండిపడ్డారు. ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు అని చెప్పారు. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు? అని ప్రశ్నించారు. రూ.80 వేల కోట్ల ధనం ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు? అని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా? అని అడిగారు. కమీషన్ల(commissions) కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా? అని అన్నారు. అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి…అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటి ? అని అన్నారు.

 ఇన్ని వేలకోట్లు ఏమైనట్లు?: KTR

కాగా బీఆర్ఎస్ హయాంలో అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ప్రతిపైసాతో మౌలిక సదుపాయాలు పెంచామని రాసుకొచ్చారు. తీసుకున్న రుణం(Loan)తో దశాబ్దాల కష్టాలు తీర్చమన్నారు. కానీ.. ముఖ్యమంత్రి తెస్తున్న అప్పుల “అడ్రస్” ఎక్కడ? అని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా.. రైతుభరోసా వేయకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా.. నెలలపాటు జీతాలు ఇవ్వకుండా.. ఇన్ని వేలకోట్లు ఏమైనట్టు? ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు? అని నిలదీశారు. రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా సొంత ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరం అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం అని అన్నారు.

 

 

Related Posts

Yash Dayal: చిక్కుల్లో ఆర్సీబీ పేసర్‌.. యశ్ దయాల్‌పై లైంగిక ఆరోపణల కేసు

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టును ఛాంపియన్‌(Champion)గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన జట్టు ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్(Yash Dayal) ప్రస్తుతం పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. UP ఘజియాబాద్‌లోని ఇందిరాపురానికి చెందిన ఓ యువతి, యశ్ దయాల్‌పై లైంగిక…

Srisailam Reservoir: కృష్ణమ్మకు ఏపీ సీఎం జలహారతి.. నేడు తెరుచుకోనున్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు

శ్రీశైలం జలాశయాని(Srisailam Reservoir)కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల(Heavy Rains) వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద(flood) నీరు వచ్చి చేరుతోంది. సుంకేసుల(Sunkesula), జూరాల(Jurala) నుంచి 1,72,705 క్యూసెక్కుల నీటి ప్రవాహం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *