BRS ​కు నీలం మధు ముదిరాజ్​ గుడ్​బై

మన ఈనాడు:
పఠాన్‌చెరు నియోజకవర్గ అసమ్మతి నేత నీలం మధు ముదిరాజ్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. పార్టీ టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపంతో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

BRS పార్టీకి మరో షాక్ తగిలింది. పఠాన్‌చెరు నియోజకవర్గ అసమ్మతి నేత నీలం మధు ముదిరాజ్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. పార్టీ టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపంతో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. సోమవారం ఉదయం ఆయన స్వగ్రామం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో మధు రాజీనామా ప్రకటన చేశారు. ఈసారి ఎన్నికల బరిలో ఉంటున్నట్లు వెల్లడించారు. కొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నీలం మధు చివరి క్షణం వరకు బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి నిన్న (ఆదివారం) బీఫాం రావడంతో నీలం మధు ముదిరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2001లో టీఆర్ఎస్‌లో చేరిన నీలం మధు.. 2014లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చిట్కూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

 

Related Posts

కటింగ్‌లు, కటాఫ్‌లు తప్ప.. రేవంత్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేంటి? 

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఏడాది పాల‌న‌పై ఎక్స్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను రేవంత్ సర్కార్ న‌ట్టేట ముంచిందని మండిపడ్డారు.  సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత‌లు, క‌టాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వ‌దిలేశార‌ని…

డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్.. చంద్రబాబుకు విజ్ఞప్తి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప ఎయిర్ పోర్టులో జిల్లా నేతలు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కడప నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు మైదుకూరు చేరుకున్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి (NTR…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *