JNTUH Online Admissions: హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

మన ఈనాడు: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిట పరిధిలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్నోవేటివ్‌ లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌.. నవంబర్‌ 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌ కోర్సు కోర్సు వ్యవధి 6 నెలలు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సుల వివరాలు..
సైబర్‌ సెక్యూరిటీ కోర్సు.. ఈ కోర్సులో సైబర్‌ సెక్యూరిటీ ఫండమెంటల్స్‌, ఈ-కామర్స్‌ అండ్‌ డిజిటల్ సెక్యూరిటీ, సైబర్‌ లాస్‌ అండ్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌.. సబ్జెక్టులు ఉంటాయి.
డేటా సైన్సెస్‌ విత్‌ పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ కోర్సు.. ప్రోగ్రామింగ్ యూజింగ్‌ పైథాన్‌, మెషిన్ లెర్నింగ్ సబ్జెక్టులు ఈ కోర్సులో చదవల్సి ఉంటుంది.
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్ కోర్సులో.. పైథాన్‌ ఫర్‌ డేటా సైన్సెస్‌, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సబ్జెక్టులు ఉంటాయి.
హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఆన్‌లైన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు తప్పనిసరిగా డిప్లొమా/ యూజీ/ పీజీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఈ ఆన్‌లైన్‌ కోర్సులను ఆన్‌లైన్‌లో ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అందిస్తారు. ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ బేసిస్‌ ద్వారా ఆయా కోర్సులకు సీట్లను కేటాయిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను డిసెంబర్‌ 15, 2023వ తేదీలోపు సమర్పించాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.500 చెల్లించాలి. ఆ తర్వాత అడ్మిషన్‌ ఫీజు రూ.1,000, కోర్సు ఫీజు రూ.25,000 చెల్లించవల్సి ఉంటుంది.

ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్‌ 15, 2023 సాయంత్రం 4 గంటల లోపు
రూ.500 అపరాధ రుసుముతో ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్‌ 22, 2023 సాయంత్రం 4 గంటల లోపు

Related Posts

NTPCలో జాబ్స్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.. నెలకు 1.4 లక్షల జీతం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా ఉద్యోగం పొందొచ్చు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.…

Gastric Problems: గ్యాస్ట్రిక్​ వేధిస్తోందా? ఇలా తగ్గించుకోండి

సరైన సమయానికి ఆహారం తినకపోవడం, జీర్ణ వ్యవస్థలో తలెత్తిన సమస్యల కారణంగా పొట్టలో గ్యాస్ సమస్య (Gastric problem) వేధిస్తుంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య బాధపెడుతుంటుంది. ఛాతి, కడుపులో మంటగా ఉంటూ ఇబ్బంది పెడుతుంది. శరీరాన్ని శక్తి హీనంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *