Mana Enadu: మూడేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రజలను గడగడలాడించింది. ఇటీవల ఓవైపు మంకీ పాక్స్ వైరస్, మరోవైపు చాందినీ వైరస్.. ఇలా రకరకాల వైరస్‌లో ప్రజలను వణికిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. వారి ఆత్మీయులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారిల భయంతో బిక్కుబిక్కమంటూ బతుకుతుంటే తాజాగా మరో వైరస్ వెలుగులోకి వచ్చింది.
సెల్యూలైటిస్ కేసులు
కరీంనగర్ జిల్లాలో సెల్యూలైటిస్ అనే వ్యాధి ప్రజలను వణికిస్తోంది. మొదట చిన్నగా దురదతో మొదలవుతున్న ఈ వ్యాధి ఆ తర్వాత పెద్ద గాయంగా మారుతోంది. ఇది సాధారణ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వల్లే సోకుతున్నా.. రోజులు గడుస్తున్న కొద్ది ప్రమాదకరంగా మారుతోందని వైద్యులు అంటున్నారు. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లపై ప్రభావం చూపుతోందని, నిర్లక్ష్యం వహిస్తే శరీరమంతా పాకే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
సెల్యూలైటిస్ కారణాలు
- చర్మం కింద ఎముకల అంటువ్యాధులు
- శస్త్రచికిత్స తర్వాత అంటువ్యాధులు
- తామర లేదా సోరియాసిస్
సెల్యూలైటిస్ లక్షణాలు
- బొబ్బలు
- జ్వరం
- నొప్పి
- ఎరుపు మచ్చలు
- చేతులు, కాళ్ల వాపు
సెల్యూలైటిస్ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో ఈ వ్యాధి బారన పడేవారని తెలిపారు. అయితే ఈసారి వందల్లో బాధితులు ఉన్నట్లు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో కేవలం కరీంనగర్ జిల్లాలోనే వందల సంఖ్యలో కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ వ్యాధి సోకిన వారు వెంటనే చికిత్స చేయించుకుంటే మేలని, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమని హెచ్చరించారు.