మన ఈనాడు: ఆంద్రప్రదేశ్లో ఎర్రచందనం పంట సాగు చేసుకోవడంతోపాటు ఎగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పరిమితంగా పండించే సంక్షిష్ట, వాణిజ్య ప్రక్రియ నుంచి ఎర్రచందనాన్ని తొలగిస్తున్నట్లు అటవీశాఖ కేంద్రమంత్రి భూపేందర్యాదవ్ ప్రకటించారు. భారత్లో నుంచి లభ్యమయ్యే రివ్యూ ఆఫ్ సిగ్నిపికెంట్ ట్రేడ్ ప్రొసెస్ కింద ఉన్న నిబంధనల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లండించారు.
దీంతో రైతులు ఎర్రచందనం సాగు చేసుకోవడంతోపాటు ఎగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించడంతో రైతులకు ప్రోత్సాహం ఇవ్వడమేనని పేర్కొన్నారు. నవంబర్ నుంచి వరకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ఎన్డేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫొనా స్థాయీసంఘ సమావేశంలో ఎర్రచందంనం సాగుపై ఉన్న ఆంక్షలను తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇక నుంచి రైతులు ఎర్రచందనం సాగు చేసుకోవడమే కాదు..ఎగుమతి చేసుకొవచ్చునని తెలిపారు.
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…






