అభిమానాన్ని ఎవరూ కొనలేరు.. ‘యూకే టూర్’లో గోల్‌మాల్‌ పై చిరు ఫైర్

‘అభిమానులారా.. మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం వెలకట్టలేనిది. నాపై మీరు చూపిస్తున్న అభిమానాన్ని ఎవరూ కొనలేరు. మన ఆత్మీయ కలయికను స్వచ్ఛంగా, స్వలాభార్జనకు దూరంగా ఉంచుదాం.’ అంటూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇటీవల ఆయన లండన్ లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూల్ చేసిన విషయం చిరంజీవి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

అలాంటి వాటిని నేను సహించను

“అభిమానులారా..! యూకేలో నన్ను కలిసేందుకు వచ్చిన మీరు చూపిన ప్రేమ నా హృదయాన్ని తాకింది. అయితే ఫ్యాన్‌ మీటింగ్‌ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి అనుచిత ప్రవర్తను నేను సమ్మతించను.  ఫ్యాన్స్‌ మీటింగ్‌ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండి. ఎప్పుడు, ఎక్కడా కూడా నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించను. ఇలాంటి వాటిని నేను పూర్తిగా ఖండిస్తున్నా. మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం వెలకట్టలేనిది.” అంటూ చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు.

జులైలో విశ్వంభర రిలీజ్

ఇక చిరు సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం ఆయన బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర (Vishwambhara)’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో చిరు సరసన కోలీవుడ్ బ్యూటీ త్రిష (Trisha) నటిస్తోంది. అషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి, ఇషా చావ్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కీలక పాత్రలో సందడి చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సీజీ వర్క్ చేసుకుంటోంది. జూన్ లేదా జులైలో ఈ సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత చిరు అనిల్ రావిపూడితో ఓ సినిమా.. దసరా ఫేం శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ చేస్తున్నారు.

Related Posts

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Prabhas : ‘ది రాజాసాబ్’ హై అలర్ట్.. మేలో అదిరిపోయే సర్ ప్రైజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘సలార్’ మూవీ తర్వాత ఓకే చేసిన ఫస్ట్ సినిమా ‘ది రాజాసాబ్ (The Raja Saab)’. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపుగా పూర్తైంది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. కానీ అకస్మాత్తుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *