
ఇంగ్లండ్(England)తో మూడు వన్డేల సమరం ముగిసింది. ఈ సిరీస్‌లో ఇంగ్లిష్ జట్టును వైట్ వాష్ చేసిన టీమ్ ఇండియా(Team India) ఇక మినీ ప్రపంచకప్‌గా భావించే ఛాంపియన్స్ ట్రోఫి(Champions Trophy 2025)కి సిద్ధమవుతోంది. మరో 6 రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19న తొలి పోరులో పాకిస్థాన్(Pakistan) జట్టుతో న్యూజిలాండ్ తలపడనుంది. 20న భారత్ వర్సెస్ బంగ్లా మ్యాచ్ జరగనుండగా.. 23న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల పోరు ఇండియా వర్సెస్ పాకిస్థాన్(India vs Pakistan) మ్యాచ్ జరగనుంది. ఇక భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్(NZ)తో ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచులన్నీ మధ్యాహ్నం ప్రారంభమవుతాయి.
3-0తో క్లీన్ స్వీప్
ఇక ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్(Three ODI series)ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 142 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా వెళ్లలేదు. దీంతో 34.2 ఓవర్లలో 214 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్, రాణా, అక్షర్, పాండ్య తలో 2 వికెట్లు తీశారు.
𝐂𝐋𝐄𝐀𝐍 𝐒𝐖𝐄𝐄𝐏
Yet another fabulous show and #TeamIndia register a thumping 142-run victory in the third and final ODI to take the series 3-0!
Details – https://t.co/S88KfhFzri… #INDvENG @IDFCFIRSTBank pic.twitter.com/ZoUuyCg2ar
— BCCI (@BCCI) February 12, 2025
‘ప్లేయర్ ఆప్ ది సిరీస్’ గిల్
అంతకు ముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (112; 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలు చేశారు. కేఎల్ రాహుల్ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్ రెండు వికెట్లు తీశాడు. కాగా సిరీస్ మొత్తం బ్యాటింగ్‌లో రాణించిన శుభ్ మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆప్ ది సిరీస్’ అవార్డు దక్కింది.