
ప్రజాకేత్రంలో వారిద్దరూ శత్రువులే.. ఎన్నికల రణరంగంలో ఇద్దరూ ప్రధాన పోటీదారులే.. రాజకీయంగా ఎవరి ఎత్తుగడలు వారివి. ఎవరి సిద్ధాంతాలు వారివి. అయితేనేం.. ఒకరిపట్ల ఒకరికి గౌరవం.ఆ ఇద్దరే తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(BRS chief Kalvakuntla Chandrasekhar Rao), తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). నేడు కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు(Birthday Wishes to KCR) తెలిపారు.
గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు… pic.twitter.com/OTtysLYlya
— Telangana CMO (@TelanganaCMO) February 17, 2025
‘గజ్వేల్ నియోజకవర్గ MLA, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు’ అని సీఎం రేవంత్ ట్వీట్(Tweet) చేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం తెలిపారు.
కాగా అంతకుముందు KCRకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా రేవంత్ యశోద ఆసుపత్రికి వెళ్లి మరీ ఆయనను పలకరించారు. ఈ విషయంలో ఆయనకు తెలంగాణ ప్రజానీకం వందకు వంద మార్కులు వేసింది. తాజాగా విష్ చేయడంతో మరోసారి రేవంత్‌ను కొనియాడుతున్నారు. కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆపార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.