మన ఈనాడుః కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హమీలలో భాగంగా శనివారం సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా పురస్కరించుకుని రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనీల్ తన సతీమణి లిఖితతో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల్లో భాగంగా నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ఆర్టీసీ బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకరావడం జరిగిందని మహిళా ప్రయాణికులకు ప్రచారం చేశారు. అంతేగాకుండా నేటి నుంచి రూ.10లక్షల ఆరోగ్యశ్రీ పథకం కూడా అందుబాటులోకి తీసుకరావడం జరిగిందన్నారు.
100రోజుల్లో మిగిలిన నాలుగు గ్యారంటీలను అమలు చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాదర్భార్ ద్వారా ప్రజాభవన్‌లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోని పరిష్కారానికి బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు మెచ్చిన పాలన కోసం సీఎం రేవంత్‌రెడ్డి సుస్థిరపాలన అందిస్తారని తెలిపారు.