ManaEnadu: రాష్ట్రంలోని కానిస్టేబుల్ అభ్యర్థుల(Constable Candidates)కు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) తీపికబురు అందించింది. పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(AP Police Recruitment Board)ను తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఇన్ఛార్జి ఛైర్మన్ ఆకే రవికృష్ణ(Ake Ravikrishna) పెండింగ్ పోస్టుల(Pending posts)పై అధికారిక ప్రకటన చేశారు. ఈ డిసెంబర్ నెల చివరి వారంలో ఫిజికల్ టెస్ట్(Physical test) నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆ అభ్యర్థులకు మరో ఛాన్స్
ఈ మేరకు YCP ప్రభుత్వ హయాంలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022లో నోటిఫికేషన్ జారీ అయింది. ఆ అభ్యర్థులకు 2024 జనవరిలో ప్రిలిమినరీ పరీక్ష(Preliminary Examination) నిర్వహించారు. దీనికి 4,59,182 మంది హాజరయ్యారు. 95,208 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధించగా 91,507 మంది మాత్రమే ఫిజికల్ టెస్ట్(Physical test)కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తు ఇదే చివరి తేది
అయితే ప్రిలిమినరీ పరీక్ష అనంతరం కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పలు కారణాల వల్ల నిలిచిపోయింది. దీంతో తాజాగా కూటమి ప్రభుత్వం భర్తీ ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఫిజికల్ టెస్ట్(Physical test)కు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు బోర్డు ఛైర్మన్ చెప్పారు. NOV 11న సాయంత్రం 3గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు slrb.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.






