ManaEnadu: పేలుళ్లతో పశ్చిమాసియా దేశం లెబనాన్(Lebanon) కుదేలైంది. అంతర్గత కమ్యూనికేషన్‌కు ఉపయోగించే పేజర్లు(Pagers) పేలడం(Explode)తో లెబనాన్‌లో వందలాది హెజ్బొల్లా(Hezbollah) సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఈ మేరకు అక్కడి భద్రతా వర్గాలు(Security forces) వివరాలు వెల్లడించాయి. లెబనాన్ (Lebanon)లో హెజ్బొల్లా సభ్యులు ఉపయోగించే పేజర్లు మంగళవారం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోసాగాయి. దాంతో, అవి ఉపయోగిస్తున్న సభ్యులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం తీసుకువెళ్లే అంబులెన్స్‌ల సైరన్‌లతో అక్కడి వీధులు మార్మోగాయని స్థానిక మీడియా వెల్లడించింది. దాదాపు గంట పాటు ఈ పేలుళ్లు కొనసాగాయని స్థానికులు తెలిపారు. లెబనాన్ దక్షిణ ప్రాంతంలో కూడా ఈ కమ్యూనికేషన్ పేజర్లు(Communication Pagers) పేలుతున్నాయని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.
ప్రతీకారం తీర్చుకుంటాం: హెజ్బొల్లా
లెబనాన్ అంతటా జరిగిన వరుస వినాశకర పేజర్ పేలుళ్ల(Pagers Explosions)లో హెజ్బొల్లా MP కుమారుడితో సహా ఎనిమిది మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ (israel)కు తగిన శిక్ష విధిస్తామని హెజ్బొల్లా ప్రతిజ్ఞ చేసింది. ఈ పేజర్ పేలుళ్లలో సుమారు 2,750 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లకు ఇజ్రాయెల్ కారణమని భావిస్తున్నారు. ఈ పేలుళ్లకు ఇజ్రాయెల్(Israel)దే పూర్తి బాధ్యత అనిహెజ్బొల్లా ఓ ప్రకటనలో ఆరోపించింది. ఈ దుశ్చర్యకు ఇజ్రాయెల్ పర్యవసానాలను ఎదుర్కొంటుందని, ప్రతీకారం తీర్చుకుంటామని మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై గత అక్టోబర్ నుంచి హెజ్బొల్లాతో కాల్పులు జరుపుతున్న ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు.
టెక్నాలజీ సాయంతో పేల్చేశారు: లెబనాన్ ఆరోగ్యశాఖ మంత్రి
కాగా ఈ ఘటనలో లెబనాన్‌లోని తమ రాయబారి మొజ్తాబా అమానీ(Mojtaba Amani) కూడా గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అలాగే మరణించిన వారిలో లెబనీస్ పార్లమెంట్‌లోని హెజ్బొల్లా ప్రతినిధి అలీ అమ్మర్(Ali Ammar) కుమారుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇజ్రాయెల్ కుట్ర అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా మొదట లెబనాన్‌లో పలుచోట్ల పేజర్ అనే కమ్యూనికేషన్ డివైజ్(Communication devices)లు పేలిపోయాయి. అదే తరహాలో ఇరాన్‌లో కొన్నిచోట్ల పేజర్లను పేల్చివేసి ప్రజల్ని భయాందోళనకు గురిచేశారు. ఈ పేజర్లు చేతిలో పట్టుకుని, ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలుంటుందని.. వాటిని టెక్నాలజీ సాయంతో పేల్చివేశారని లెబనాన్ ఆరోగ్యశాఖ మంత్రి(Health Minister) చెప్పారు.