సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి వారిలో చాలా కొద్దిమంది మాత్రమే ఫుల్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే బాటలో నడవాలని అనుకుంటున్నారు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay). తమిళనాట రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఇప్పటికే విస్తృతంగా ప్రజల్లోకి తన పార్టీని తీసుకెళ్తున్నారు. అయితే ఆయన పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు.
Adiyum othaiyum kalanthu vechu vidiya vidiya virundhu vecha.. #JanaNayaganPongal 🔥🔥🔥
09.01.2026 ❤️❤️❤️#JanaNayaganFromJan9
Dearest Thalapathy @actorvijay sir #HVinoth @KvnProductions @Jagadishbliss @hegdepooja @mamitha_baiju @lohithnk pic.twitter.com/QwXAvBioqB
— Anirudh Ravichander (@anirudhofficial) March 24, 2025
దళపతి విజయ్ చివరగా జన నాయగన్ (Jana Nayagan) అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇదే ఆయన ఆఖరి చిత్రంగా ఇంతకుముందే విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. డైరెక్టర్ హెచ్.వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. 2026 జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
పూజా హెగ్డే (Pooja Hegde) ఫీమేల్ లీడ్‌లో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ దేవోల్, మమితా బైజూ, ప్రియమణి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా దళపతికి చివరి చిత్రం కానున్న నేపథ్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికాలని మేకర్స్ యోచిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ రూపొందించినట్టు సమాచారం. అందులో దర్శకులు లోకేశ్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్‌తోపాటు ఓ హీరో అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం.






