ManaEnadu: మన దేశంలో రోడ్డు ప్రమాదాల(Road Accident) కారణంగా ఏటా 1,50,000 వేల మంది చనిపోతున్నారు. వీరిలో ఆసుపత్రికి(Hospitals) తీసుకెళ్లేలోపే 60 నుంచి 70 వేల మంది మృతి చెందుతున్నారు. అంటే ప్రమాదం జరిగిన తర్వాత త్వరగా అక్కడికి అంబులెన్స్(Ambulance)లు, లేదా బంధువులు చేరుకోలేక సగం మంది చనిపోతున్నారు. అలాంటి వారిలో దినేష్(Dinesh) ఒకరు. తన స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వివేక్ జస్టస్(Vivek Justus) అనే యువకుడు 27 ఏళ్ల వయసులో ఒక పరికరం కనిపెట్టాడు. అదేంటంటే..
లోకేషన్ ఆధారంగా ఎమర్జెన్సీ సేవలకు సమాచారం
ప్రమాదం జరిగినప్పుడు ఆటో మెటిక్‌గా ట్రిగ్గర్(Trigger automatically) అయ్యే రక్షణ వ్యవస్థను తయారు చేశాడు. ఈ పరికరం వాహనాలకు సెట్ చేస్తారు. ప్రమాదం జరిగాక లోకేషన్ ఆధారంగా ఎమర్జెన్సీ సేవలకు(Emergency services) సమాచారం ఇస్తుంది. దీంతో తక్షణమే రక్షణ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇదంతా మూడు నిమిషాల లోపలే జరుగుతుందట. ఈ పరికరం ఇంటర్నెట్(Internet) అవసరం లేకుండా కూడా పనిచేస్తుంది. స్నేహితుడి మరణం చూసి చలించిపోయి అలా ఎవ్వరికీ కాకూడదని వివేక్ చేసిన ఆలోచన అభినందనీయం. టెక్నాలజీ సాయంతో అద్భుతాలు చేయొచ్చని వివేక్ మరోసారి నిరూపించాడు. ఇది పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి రావాలని అందరం కోరుకుందాం.
రోడ్డు ప్రమాదాల్లో భారత్ టాప్
ఇక ప్రపంచంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు(Road accidents and deaths) సంభవించే దేశాల జాబితాలో భారత్ మెుదటిస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల 64వ వార్షిక సదస్సు(Society for Indian Automobile Manufacturers Summit)లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. మన దేశంలో ప్రతి గంటకు దాదాపు 53 ప్రమాదాలు, 19 మరణాలు జరుగుతున్నాయి. బైక్స్ వల్ల 45 శాతం, పాదచారుల వల్ల 20 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సంఖ్యలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.