ManaEnadu: దేశ బాహ్య, అంతర్గత భద్రతా(External, Internal Security) వ్యవస్థలను పటిష్ఠం చేయడం ద్వారా దేశాన్ని సురక్షితంగా మార్చడంలో మోదీ ప్రభుత్వం ప్రధాన మైలురాయిని సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Home minister) అన్నారు. మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గత 10 సంవత్సరాలలో, భారతదేశ బాహ్య, అంతర్గత భద్రత, రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంలో మోదీ(PM Modi) ప్రభుత్వం గొప్ప విజయాన్ని సాధించింది. దేశాన్ని సురక్షితమైన దేశంగా మార్చింది’ అని షా అన్నారు. NDA ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించిన హోంమంత్రి.. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav)తో కలిసి, PM మోదీ మూడవ టర్మ్ సమయంలో ప్రభుత్వం మొదటి 100 రోజుల విజయాలపై ప్రత్యేక బుక్‌లెట్‌ను విడుదల చేశారు.
100 రోజుల్లోనే రూ.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు
ప్రధాని మోదీ నాయకత్వంలో 140 కోట్ల మంది ప్రజలు భారత్(India)ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే భాగస్వామ్య దృష్టితో ఏకమయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) అన్నారు. “ఈ అద్భుతమైన ఫీట్ ప్రధాని మోదీ(PM Modi) దార్శనికతపై దేశం అచంచలమైన విశ్వాసాన్ని చూపిస్తుంది,” అని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రూ.15 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను(Projects) ప్రారంభించిందని, ఇది దేశ వేగవంతమైన అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని హోం మంత్రి పేర్కొన్నారు.
నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రధాని అయ్యారు
60 ఏళ్లలో దేశానికి మూడుసార్లు సారథ్యం వహించిన మొదటి వ్యక్తిగా మోదీ నిలిచారు. 60 ఏళ్ల తర్వాత ప్రస్తుతం దేశంలో రాజకీయ సుస్థిరత ఉంది. ప్రజెంట్ దేశం అన్నిరంగాలకు ఉత్పత్తి కేంద్రంగా ఉందని చెప్పారు. అనేక దేశాలు మా ‘డిజిటల్ ఇండియా(Digital India)’ పథకాన్ని అర్థం చేసుకుని అమలు చేయాలని కోరుకుంటున్నాయి. “ఒక చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి అయిన మోదీ జీ. అతనికి అత్యున్నత పురస్కారాలు అందించిన 15 దేశాలు ఆయనను సత్కరించాయి” అని షా పేర్కొన్నారు.
मोदी सरकार के तीसरे कार्यकाल के पहले 100 दिनों में ₹15 लाख करोड़ की परियोजनाएँ शुरू की गईं।#100DaysOfModi3 pic.twitter.com/eIWnbPvPHc
— Amit Shah (@AmitShah) September 17, 2024