Mana Enadu: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండ్రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు. నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండననని తెలిపారు. తాజాగా ప్రజాతీర్పు కోరతానని వెల్లడించారు. ఆప్ కార్యకర్తల సమావేశంలో రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దిల్లీలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతానని వివరించారు.
“ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే మాతో ఉండి ముందుకు నడిపించాడు. దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతాం. ఆప్ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారు. త్వరలోనే వారు బయటకు వస్తారని ఆశిస్తున్నాం. దిల్లీలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతాను. నేను నిర్దోషిని అని నమ్మితేనే ఓట్లు వేయండి. మహారాష్ట్రతో పాటే దిల్లీకి ఎన్నికలు నిర్వహించాలి.” అని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ వ్య వహరానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఇటు ఈడీ అటు సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఈడీ కేసులో బెయిల్ రాగా తాజాగా సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తిహాడ్ జైలు నుంచి ఈనెల 13వ తేదీన విడుదలయ్యారు. కుట్రపై సత్యం విజయం సాధించిందని , దేశాన్ని బలహీన పరుస్తున్న, విభజిస్తున్న శక్తులపై తన పోరాటం ఆగదని జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
అయితే కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని, ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని స్పష్టం చేస్తూ 10 లక్షల బెయిల్ బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…