
ఢిల్లీ రైల్వే స్టేషన్(Delhi Railway Station)లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఎలాంటి కుట్రకోణం(No conspiracy behind the stampede) లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్(Railway Minister Vaishnav) తెలిపారు. ఆ ఘటనలో కుట్రదాగి ఉందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. రైల్వే స్టేషన్ లోపలి, బయటి CCTV కెమెరాలను పరిశీలించామని, ఆ సమయంలో ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించలేదని దర్యాప్తు సంస్థలు తెలిపినట్లు ఆయన వివరించారు. పైగా ఆ ఘటన జరిగిన సమయంలో స్టేషన్‌లో తొక్కిసలాట(Stampede) జరిగేంత జనసమూహం కూడా అక్కడ లేదని మంత్రి వివరించారు. కాగా ఫిబ్రవరి 15న ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్(Prayagraj) వెళ్లే క్రమంలో ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించగా.. 15 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు కేంద్రబలగాలతో భద్రత
తొక్కిసలాట ఘటనతో ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో పటిష్ఠ ఏర్పాట్లు చేశామని ఢిల్లీ పోలీసు అధికారులు(Delhi Police Officers) తెలిపారు. లోపల, బయట బారికేడ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశామని, అలాగే కంట్రోల్ రూమ్‌లు రియల్ టైమ్ ఫుటేజీని పర్యవేక్షిస్తుండటంతో CCTV నిఘా కూడా మెరుగుపరిచామని తెలిపారు. కాగా దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటైన ఢిల్లీ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP), రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు.
ఒకేసారి 48వేల మంది ప్రయాణికులకు సౌకర్యంగా..
రద్దీగా ఉండే న్యూఢిల్లీ స్టేషన్‌లోని మొత్తం 16 ప్లాట్‌ఫామ్‌ల మొత్తం సామర్థ్యం ఏ సమయంలోనైనా 48,000 మంది ప్రయాణికులు(Passengers) ఉంటారని, ప్రతి ప్లాట్‌ఫామ్ 3000 మంది ప్రయాణికులను పట్టుకోగలదని రైల్వే అధికారులు తెలిపారు.”సంఘటన జరిగిన రోజు ఫిబ్రవరి 15న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య దాదాపు 12,208 అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇతర రోజుల్లో ఈ సంఖ్య సాధారణంగా 9,600 ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య 8,900 అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లు అమ్ముడైతే, ఫిబ్రవరి 15న 7,600 అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి” అని తెలిపారు.