Pawan Kalyan: 96ఏళ్ల వృద్ధురాలితో కలిసి భోజనం చేసిన పవర్‌స్టార్

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాన్(Pawan Kalyan) మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. తన పట్ల అపారమైన అభిమానం కలిగిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు(Pothula Perantalu)తో కలిసి ఆయన భోజనం చేసి, ఆమె ఆనందానికి కారణమయ్యారు. పవన్‌కు వీరాభిమాని అయిన ఆ వృద్ధురాలు ఆయనతో భోజనం చేయాలనే ఆమె చిరకాల కోరిక. ఈ విషయం తెలుసుకున్న పవన్ తక్షణమే స్పందించి ఆమెను జనసేన క్యాంపు కార్యాలయాని(Janasena camp office)కి ఆహ్వానించారు. అక్కడ ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ఆమెతో కలిసి భోజనం(Lunch) చేశారు. అంతేకాకుండా ఆ వృద్ధురాలికి రూ.లక్ష నగదు అందించి, కొత్త చీరను కూడా బహూకరించారు. ఈ వీడియో సోషల్ మీడియా(SM)లో వైరల్ అవుతోంది.

పవన్ గెలిస్తే పొర్లు దండాలు పెడతానని మొక్కులు

కాకినాడ జిల్లా, కొత్తపల్లి మండలం, కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన పోతుల పేరంటాలు 2024 ఎన్నికలలో పవన్ పిఠాపురం నియోజకవర్గం(Pithapuram Constituency) నుంచి గెలిస్తే వేగులమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, పొర్లు దండాలు సమర్పిస్తానని మొక్కుకున్నారు. ఆ కోరిక నెరవేరడంతో తన ఫించను డబ్బులతో అమ్మవారికి వెండి గరగ చేయించి సమర్పించి, ఇతర మొక్కులు చెల్లించారు. ఈ విషయం పవన్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు.

Related Posts

Srisailam Reservoir: కృష్ణమ్మకు ఏపీ సీఎం జలహారతి.. నేడు తెరుచుకోనున్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు

శ్రీశైలం జలాశయాని(Srisailam Reservoir)కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల(Heavy Rains) వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద(flood) నీరు వచ్చి చేరుతోంది. సుంకేసుల(Sunkesula), జూరాల(Jurala) నుంచి 1,72,705 క్యూసెక్కుల నీటి ప్రవాహం…

Texas Floods: టెక్సాస్‌లో ఆకస్మిక వరదలు.. వంద మందికిపైగా మృతి

అమెరికాలోని టెక్సాస్(Texas) రాష్ట్రంలో సంభవించిన ఆకస్మిక వరదలు(Flash floods) పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య 104 మంది మరణించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇంకా చాలా మంది గల్లంతైన నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *