Mana Enadu: నందమూరి స్టార్ హీరో, జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR), కొరటాల శివ(Koratala Shive) కాంబోలో వచ్చిన మూవీ దేవర:పార్ట్ 1(Devara). ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా SEP 27న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ, అలనాటి దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించారు. మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఈ మూవీపై అదే హైప్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో లాంగ్ రన్లో దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది.
స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే..
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్(Global star NTR) నటించిన ఈ మూవీని ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్(Netflix) సంస్థ దేవర సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు దక్కించుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ మూవీ 2024 November 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్(OTT streaming) కానున్నట్లు తెలుస్తోంది. మరి పాన్ఇండియా రేంజ్లో రిలీజైన మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుందో కూడా తెలియాల్సి ఉంది. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ దీన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే దీపావళి(Diwali) కంటే ముందే ఈ సినిమా రిలీజై నాలుగు వారాలు కంప్లీట్ చేసుకుంటుంది. దీంతో దీపావళి సందర్భంగానూ OTTలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ముందు నుంచి ఆదే హైప్
కాగా టీజర్, ట్రైలర్, పాటలతో భారీ హైప్‌ను సొంతం చేసుకున్న దేవర థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.