తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush) మరోసారి ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే థ్రిల్లర్(Thrillar) సినిమాతో రాబోతున్నారు. ఇటీవలే ‘కుబేర’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ఆయన, తన 54వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి D54 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘Por Thozhil’(పోర్ తొళిల్)వంటి హిట్ థ్రిల్లర్ తెరకెక్కించిన దర్శకుడు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డా. ఇషారి కె. గణేష్ నిర్మించబోతున్నారు. థింక్ స్టూడియోస్ కూడా సహనిర్మాతగా పాల్గొంటోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ ఈ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచింది. పోస్టర్లో పత్తి పంటల మధ్య నిలబడి ఉన్న ధనుష్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. అతని వెనుక ఎగసిపడుతున్న మంటలు, మిస్టీరియస్ వాతావరణం ఈ సినిమా ఓ ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఉండబోతోందన్న సంకేతాలు ఇస్తోంది.
ఈ చిత్రంలో హీరోయిన్గా ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు నటిస్తున్నారు. సంగీతాన్ని యువ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. నటీనటుల పరంగా చూస్తే కూడా ఈ సినిమా భారీగా రూపొందుతోంది. ప్రముఖ నటులు జయరామ్, కె.ఎస్. రవికుమార్, సూరజ్ వెంజరమూడు, కరుణాస్, పృథ్వీ పాండిరాజ్ వంటి నటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ధనుష్ తన ఫిల్మోగ్రఫీలో ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తూ ఉండటం తెలిసిందే. D54 చిత్రం కూడా అలాంటి మరో వినూత్న ప్రయోగంగా నిలిచే అవకాశముంది. థ్రిల్, డ్రామా, ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా 2025లో విడుదలయ్యేలా చిత్రబృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Sometimes staying dangerous is the only way to stay alive.#D54 starring @dhanushkraja – On floors from today. Produced by @Isharikganesh @VelsFilmIntl. A film by @vigneshraja89 💥
A @gvprakash Musical 🎶@ThinkStudiosInd @alfredprakash17 @thenieswar @ksravikumardir… pic.twitter.com/r558oEi3Rx
— Vels Film International (@VelsFilmIntl) July 10, 2025






