
కన్నడ భామ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) అంటే తెలియనివారుండరు. ఈ భామ తెలుగు, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూ సూపర్ స్టార్ డమ్ తెచ్చుకుంది. కెరీర్ మొదటి నుంచీ ఈ భామ దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఈ బ్యూటీకి లక్ బాగా కలిసొస్తుంది. అందుకే ఈ భామ ఉంటే సినిమా హిట్ అనే నమ్మకం దర్శకులు, నిర్మాతలు, చివరకు హీరోలు కూడా ఫీల్ అవుతున్నారు. అందుకే కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి మరీ రష్మికను తమ సినిమాలో భాగం చేసుకుంటున్నారు.
రౌడీ జనార్ధనలో కన్నడ భామ
అయితే ఎప్పుడూ క్యూట్ గా, స్మైల్ తో కనిపిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించే రష్మిక ఏకంగా ఓ హీరోయిన్ కే వార్నింగ్ ఇచ్చిందట. మరో కన్నడ నటికి రష్మిక గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. సప్తసాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) కు ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ భామ ఇటీవల విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
View this post on Instagram
రుక్మిణీకి రష్మిక వార్నింగ్
రవికిషన్ కోలా డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా రౌడీ జనార్ధన (Rowdy Janardhana) అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ కు జోడీగా రుక్మిణీని నిర్మాతలు ఫైనల్ చేశారట. అయితే విజయ్(Vijay Deverakonda) తో కలిసి నటించొద్దని రుక్మిణీకి రష్మిక మందన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని ఇప్పుడు నెట్టింట టాక్. అందుకే ఈ భామ రౌడీ జనార్ధన సినిమా నుంచి తప్పుకున్నట్లు తాజాగా న్యూస్ చక్కర్లు కొడుతోంది. రష్మిక- విజయ్ దేవరకొండ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన బాయ్ ఫ్రెండ్ తో నటించొద్దని ఈ బ్యూటీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
విజయ్ సినిమా నుంచి ఔట్
ఇక రుక్మిణీ కూడా ఈ ఇద్దరి లవర్స్ తో తనకు గొడవెందుకులే అనుకుందేమో విజయ్ తో నటించే ఛాన్స్ వదిలేసుకుందట. కానీ ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ (Prashant Neel) కాంబోలో వస్తున్న సినిమాలో మాత్రం రుక్మిణీ నటించేందుకు ఓకే చెప్పేసిందట. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకోబోతోంది ఈ భామ. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ భామ కోసం నిర్మాతలు, హీరోలు క్యూ కడుతున్నారు. కానీ చేతికొచ్చిన ఆఫర్ ను ఈ భామ కేవలం రష్మిక వార్నింగ్ ఇచ్చినందుకే వదిలేసుకుందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…