
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram).. ఇటీవల ‘క(KA)’ మూవీతో హిట్‌కొట్టి టాలీవుడ్‌లో తనదైన ముద్రవేశాడు. ఇక అదే జోష్‌లో ‘దిల్ రూబా(Dilruba)’ని పట్టాలెక్కించాడు. యంగ్ డైరెక్టర్ విశ్వ కరుణ్(Viswa Karun) తెరకెక్కించిన ఈ మూవీ హోలీ(Holi) కానుకగా ఇవాళ (మార్చి 14) థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్(Promotions), టీజర్ వంటివి ఆకట్టుకోవడం ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. రుక్సర్ దిల్లాన్(Ruxar Dhillon), క్యాథీ డేవిసన్(Cathy Davison) హీరోయిన్లుగా నటించగా.. సత్య, నరేన్, జాన్ విజయ్ కీలక పాత్రలు పోషించారు. మరి ఇవాళ థియేరట్లలోకి వచ్చిన ఈ మూవీ అభిమానులను ఏ మేర ఆకట్టుకుందో ఓసారి చూద్దామా..
కథేంటంటే..
సిద్ధు రెడ్డి (Kiran Abbavaram) చిన్నప్పటి తనతో కలిసి పెరిగిన మ్యాగీ (Cathy Davison)ను ప్రేమిస్తాడు. ఆపదలో ఉన్న ఓ ఫ్రెండ్‌ని తన బిజినెస్‌లో పార్టనర్‌గా చేర్చుకుంటే, అతడే తనను మోసం చేయడం తట్టుకోలేక ఆ బాధలో సిద్ధు తండ్రి మరణిస్తాడు. ఈ తరుణంలోనే కొన్ని కారణాల వల్ల మ్యాగీతో సిద్ధుకు బ్రేకప్ అవుతుంది. ఇక అప్పటి నుంచే తన జీవితంలో సారీ(SORRY), థ్యాంక్స్(THANKS) అనే మాటలకు దూరంగా ఉండాలని సిద్ధు నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అవుతాడు.
అక్కడ పరిచయమైన అంజలి (Ruxar Dhillon)ను ప్రేమిస్తాడు. అయితే కాలేజీలో జరిగిన ఓ గొడవ వల్ల వీళ్లిద్దరు కూడా విడిపోవాల్సి వస్తుంది. అమెరికాలో ఉంటున్న మ్యాగీ ఇది తెలుసుకుని ఇండియాకు చేరుకుంటుంది. ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుంది. అయితే సిద్ధు-అంజలి మధ్య జరిగిందేమిటి? ఈ ఇద్దరిని మ్యాగీ ఎలా కలిపింది? అసలు మ్యాగీ, సిద్ధుకు బ్రేకప్ చెప్పడానికి కారణమేమిటి? అనేది తెరపై చూడాల్సిందే.
స్టోరీ విశ్లేషణ
ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ(Triangle Love Story). కథ, కథనాలు సాదాసీదాగా ఉండటంతో సినిమా ఎక్కడా కూడా ఆస్తకిగా అనిపించదు. ముఖ్యంగా హీరో పాత్ర చుట్టూ అల్లుకున్న కథలా అనిపిస్తుంది. బలమైన కథ లేకపోవడం వల్ల సినిమా స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్ పర్వాలేదనిపించుకున్నా, సెకండాఫ్ మరింత పేలవంగా అనిపిస్తుంది. కథలోని ఎమోషన్‌తో ప్రేక్షకుడు ఎక్కడా కూడా కనెక్ట్ కాలేడు. సినిమా ప్రారంభంలో కొన్ని సన్నివేశాలు కథ, కథనాలపై ఇంట్రెస్ట్ కలిగించినా ఆ తరువాత దర్శకుడు దానిని కొనసాగించలేక పోయాడు.
ఎవరెలా చేశారంటే..
సిద్ధుగా కిరణ్ అబ్బవరం ఉత్సాహంగా కనిపించాడు. దర్శకుడు తనకు డిజైన్ చేసిన పాత్రకు న్యాయం చేశాడు. అంజలిగా రుక్సర్ ఎంతో ఎనర్జీగా కనిపిస్తుంది. సినిమాలో ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది. అయితే మ్యాగీ పాత్రలో క్యాథీ డేవిసన్ పర్‌ఫార్మెన్స్‌కు పెద్దగా స్కోప్ లేదు. డైలాగ్స్‌లో పూరీ జగన్నాథ్ మార్క్ కనిపించింది కానీ ఆ మ్యాజిక్ వర్కవుట్ కాలేదు. ఇక విలన్‌గా కనిపించిన జోకర్ పాత్ర మరీ చిరాకు తెప్పిస్తుంది.
ఓవరాల్‌గా ‘దిల్ రూబా’ ప్రేక్షకుల ‘దిల్’ను థ్రిల్ల్ చేయడంలో సక్సెస్ కాలేదు.
Rating: 2/5