
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) వివాదాలకు దూరంగా సినిమాలకు చాలా దగ్గరగా ఉంటారు. కానీ తాజాగా ఆయన చుట్టూ ఓ వివాదం ముదిరింది. ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు జక్కన్నపై సంచలన ఆరోపణలు చేశాడు. జక్కన్న టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోతో పాటు ఓ లెటర్ విడుదల చేశాడు. 34 ఏళ్లుగా రాజమౌళితో స్నేహం ఉందని, యమదొంగ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పని చేశానని తెలిపాడు. ఇక సెల్ఫీ వీడియో, లెటర్ ను రాజమౌళి సన్నిహితులకు పంపాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే..?
‘He Ruined My Career For A Woman’: ‘Close Friend’ Srinivasa Rao Accuses SS Rajamouli Of ‘Harassment’ In Suicide Note, Records Video #SSRajamouli
Translation of Video by a Redditor ⬇️⬇️⬇️
Today I am committing suicide because of Rajamouli We are friends for more than 30 years… pic.twitter.com/gl1nd0B42p
— Redditbollywood (@redditbollywood) February 27, 2025
మాది ఆర్య-2 మూవీ స్టోరీ
“డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వల్ల నేను చచ్చిపోతున్నా. పబ్లిసిటీ కోసం నేను ఈ వీడియో రికార్డు చేయడం లేదు. మా ఇద్దరిది 34 ఏళ్ల ఫ్రెండ్షిప్. ఈ విషయం సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులకు కూడా తెలుసు. ఓ అమ్మాయి వల్ల మేం విడిపోవాల్సి వచ్చింది. ఆర్య-2 సినిమాలాగే.. ముందు రాజమౌళి, తర్వాత నేను ఒకే అమ్మాయిని ప్రేమించాం. ఈ విషయం తెలిశాక రాజమౌళిని ఏం చేద్దాం అని అడిగాను. దానికి తాను నన్ను ఆ అమ్మాయిని వదిలేయమన్నాడు. దానికి నేను ఒప్పుకోలేదు. ముగ్గురం కలిసుందాం అన్నా ఒప్పుకోలేదు. సరే నేను పెళ్లి చేసుకుంటాను. కనీసం నలుగురం కలిసి ఉందాం అన్నాను. అది చండాలంగా ఉంటుందని అన్నాడు.
అమ్మాయిల జోలికి వెళ్లొద్దు
కాలం అన్ని గాయాలు మాన్పేస్తుంది నువ్వు నీ ప్రేమను త్యాగం చేయమని అన్నాడు. ఇదంతా రాజమౌళి డైరెక్టర్ కాకముందు జరిగింది. ఇప్పుడు ఈ విషయం ఎవరికైనా చెబుతానేమోనని నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఓసారి మాకు గొడవ జరిగినప్పుడు మన స్టోరీని సినిమా తీస్తానని చెప్పాను. అప్పటి నుంచి టార్చర్ మరీ ఎక్కువైంది. ఒక ఫ్రెండ్ వల్ల నా లైఫ్ నాశనం అయింది. మీరెవ్వరూ నాలా అమ్మాయిల జోలికి వెళ్లొద్దు. ఇదంతా జరిగిందనడానికి నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. కానీ పోలీసులు ఈ వీడియోను సుమోటోగా కేసు నమోదు చేయాలి. లై డిటెక్టర్ టెస్ట్ చేసిన నిజాలు రాబట్టాలి ” అని బాధితుడు శ్రీనివాస్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.
జక్కన్నకు నెటిజన్లు సపోర్టు
అయితే ఈ సెల్ఫీ వీడియో, లెటర్ ను ఇప్పటి వరకు పోలీసులు ధ్రువీకరించలేదు. రాజమౌళి కూడా దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ ఈ వీడియో, లెటర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసి నెటిజన్లు ఇదంతా ఓ డ్రామా అని అంటున్నారు. జక్కన్నకు ఇలా చేయాల్సిన అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది దర్శకధీరుడికి సపోర్టుగా నిలుస్తున్నారు.