
పీఎఫ్ ఖాతాదారుల(For PF Customers)కు అలర్ట్.. మీకు ఒకటి కన్నా ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? EPF అకౌంట్లన్నీ ఆన్‌లైన్‌లో ఒకే అకౌంట్‌కు విలీనం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రైవేటు ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతుంటారు. ఇలాంటి అనేక మంది ఉద్యోగులు పాత UAN నంబర్ కాకుండా కొన్నిసార్లు వేరే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో కొత్త (EPF) అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు. అప్పుడు మీ పాత OLD అకౌంట్లలో జమ అయిన డబ్బు అలానే ఉంటుంది. కొత్త పీఎఫ్ అకౌంట్లలోకి క్రెడిట్ కాదు. అప్పుడేం చేయాలో తెలుసుకుందాం..
నష్టాలను ఎదుర్కోకుండా ఉండాలంటే..
పాత PF అకౌంట్లలో మీ డబ్బు ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్(Auto Transfer) కాదని గమనించాలి. మీరే మాన్యువల్‌గా రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అన్ని అకౌంట్లను విలీనం చేయడం వల్ల ఎలాంటి నష్టాలను ఎదుర్కోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. రెండు లేదా అంతకంటే ఎక్కువ EPF అకౌంట్లను ఆన్‌లైన్‌లో ఎలా విలీనం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇలా చేయండి..
☛ EPFO అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
☛ మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో Sign in చేయండి.
☛ ‘Oneline Services’ అనే సెక్షన్ కింద ‘One Member-One EPF Account’ ఎంచుకోండి.
☛ ఫోన్ నంబర్, UAN నంబర్ వంటి అన్ని వివరాలను నింపండి.
☛ ‘Generate OTP’పై క్లిక్ చేయండి.
☛ OTP ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయండి.
☛ కొత్త విండో Pop-Up ఓపెన్ అవుతుంది.
☛ మీరు మెర్జ్ చేసే PF అకౌంట్ల వివరాలను డిక్లరేషన్‌కు (Agree) చేసి (Submit)పై క్లిక్ చేయండి.
ఆన్‌లైన్‌లో ఈజీగా మెర్జ్ చేయొచ్చు
మీ వివరాలను పంపిన తర్వాత మీ ప్రస్తుత యజమాని మెర్జ్ రిక్వెస్ట్(Merge Request) ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదం తర్వాత, EPFO మీ రెండు PF అకౌంట్లను ప్రాసెస్ చేసి విలీనం చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత మీరు పోర్టల్‌లో బ్యాంకు స్టేటస్(Bank Status) కూడా చెక్ చేయవచ్చు. ఇమెయిల్ ద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువ EPF అకౌంట్లను ఆన్‌లైన్‌లో ఈజీ(Easy)గా మెర్జ్ చేయొచ్చు. సింపుల్‌గా ఒక ఇమెయిల్ పంపితే చాలు.. PF అకౌంట్లు ఎన్ని ఉన్నా ఒకేసారి మెర్జ్ చేయవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం.. మీరూ మెర్జ్ చేసుకోండి..