Mana Enadu : చాలా మంది తమ దైనందిన జీవితంలో ఉరుకులు పరుగుల(Busy Life)తో సమయాన్ని దాటేస్తున్నారు. ప్రస్తుతం జీవన విధానం పూర్తిగా మారిపోయింది. గంటల తరబడి కుర్చీలో కూర్చొనే పని(Sitting in a chair for hours), వేళకు ఆహారం(Food) తినకపోవడం, ఒక వేళ ఏదో సమయంలో తిన్నా.. అది పౌష్టికాహారం(Nutritious food) కాకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, వ్యాయామం(exercise) లేక శరీరం కుదేలవుతుంది. దీంతో శారీరక ఒత్తిడితోపాటు మానసిక ఒత్తిడితో ఆరోగ్యం(Health with stress) మరింత క్షీణిస్తుంది. ఈ కారణాలతో చాలా మంది చిన్న, మధ్య వయస్సులోనే ముసలివారవుతున్నారని(getting old Age) నిపుణుల తాజా అధ్యయనాలు(Recent studies) స్పష్టం చేస్తున్నాయి.
తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే..?
తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెలుగు చూసిన ఆసక్తికర విషయమేమిటంటే ఎలాంటి శారీరక శ్రమ(physical activity) లేకుండా గంటల తరబడి ఒకేచోట కదలకుండా కూర్చోవడం వల్ల త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్(University of Colorado Boulder), యూనివర్సిటీ ఆప్ కాలిఫోర్నియా రివర్స్‌సైడ్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే ఎక్కువ సేపు కూర్చంటున్నాం కదా అని ఏదో పేరుకు కొద్దిసేపు వ్యాయామం చేస్తే సరిపోదని పరిశోధకులు చెబుతున్నారు. కచ్చితంగా రోజులో 30-45 నిమిషాల్లో వాకింగ్ లేదా ఏదో ఒక పద్ధతిలో వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి
ఒత్తిడికి గురయ్యేవారి స్కిన్ చాలా ఫాస్ట్‌గా ముడతలు(Skin wrinkles very fast) పడిపోతుంది. ఒత్తిడి ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది, ఇది చర్మాన్ని డల్‌గా చేస్తుంది. అకాల వృద్ధాప్యానికి దారి తీస్తుంది. కాబట్టి, ధ్యానం, యోగా లేదా ఫేవరెట్ హాబీ ద్వారా స్ట్రెస్(Stress) తగ్గించుకోవాలి. రోజూ తగినంత నిద్ర పోకపోతే బాడీ నేచురల్ రిపేర్ ప్రాసెస్లు దెబ్బతింటాయి. ఇది ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది.
రోజూ కనీసం 7-8 గంటల నిద్రపోవాలి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పుష్కలంగా నీరు తాగడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్(Dehydration) కారణంగా త్వరగా ముసలి వాళ్లు అవుతారు. అతిగా ఆల్కహాల్(Alcohol) తాగితే స్కిన్ డీహైడ్రేట్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది, ఇవన్నీ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి. ఈ కారకాలు ముడతలు, డల్ స్కిన్, అన్ఈవెన్ స్కిన్ టోన్‌కు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.






