ఆసక్తికరంగా దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్

Mana Enadu : మలయాళం స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. దుల్కర్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవ్వడం.. తెలుగులో మహానటి, కల్కి, సీతారామం వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar) అనే సినిమాలో నటిస్తున్నాడు.

మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 31వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్ (Lucky Baskhar Trailer) రిలీజ్ చేశారు. “నా పేరు భాస్కర్ కుమార్‌.. నా జీతం ఆరు వేల రూపాయలు. బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా.. నేనే కావాలని నన్ను చేసుకుంది నా భార్య సుమతి. నా బలం నా భార్య”.. అంటూ దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్‌తో ఈ ట్రైలర్ సాగింది. డబ్బే అన్నింటికంటే విలువైనది అనే పంథాలో ఈ సినిమా సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఆరు వేల రూపాయల జీతం తీసుకునే బ్యాంకు ఉద్యోగి భాస్కర్ కోటీశ్వరుడు ఎలా అయ్యాడనేదే ఈ సినిమా కథగా తెలుస్తోంది.

ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వర్సటైల్ పాత్రలు చేస్తూ.. పాత్రకు ప్రాధాన్యత ఉంటే చాలు.. అది సినిమాలో ఎంత సేపు ఉంటుందన్న విషయం కూడా తన సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు దుల్కర్. అలా చేసిన పాత్రలే మహానటి(Mahanati)లో ఎంజీఆర్, కల్కి(Kalki Movie)లోని పాత్రలు. ఇక లక్కీ భాస్కర్ లో మాత్రం తనలోని వర్సటాలిటీని మరోసారి చూపించాడు ఈ హీరో. 

ఇక ఈ సినిమా సంగతికి వస్తే.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్నిస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజికల్ సెన్సేషన్ జీవీ ప్రకాష్‌ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనున్నట్టు ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది.

Share post:

లేటెస్ట్