కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు

Mana Enadu : కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో ముడా స్కామ్ (MUDA scam) కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ స్కామ్‌ వ్యవహారంలో తాజాగా ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మనీలాండరింగ్‌ కేసు (money laundering case) నమోదు చేసింది.

సిద్ధరామయ్యపై లోకాయుక్త కేసు  

భూముల వ్యవహారంలో సిద్ధరామయ్య (Siddaramaiah) అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఆయనపై లోకాయుక్త కేసు నమోదు చేసింది.

సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు

ఆ ఎఫ్‌ఐఆర్‌లో సిద్ధరామయ్య (Siddaramaiah ED Case)ను ప్రథమ నిందితుడిగా పేర్కొంటూ.. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్‌ స్వామితో పాటు మరో వ్యక్తి పేర్లను నిందితులుగా జాబితాలో చేర్చింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై తాజాగా కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరికొందరి పేర్లను కూడా అందులో పేర్కొన్నారు.

ముడా స్థలాల పంపిణీలో అక్రమాలు  

మైసూరు నగరాభివృద్ధి సంస్థ (MUDA Scam) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరు కావాలంటూ సిద్ధరామయ్యకు కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు వారసత్వంగా వచ్చిన భూములను ‘ముడా’ స్వాధీనం చేసుకుని మరొక చోట స్థలాలు మంజూరు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అంతే కాకుండా స్వాధీనం చేసుకున్న భూముల కంటే మంజూరు చేసిన స్థలాల విలువ ఎక్కువగా ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

Share post:

లేటెస్ట్