Assembly Elections:ఛత్తీస్ఘడ్, మిజోరంలలో మొదలైన పోలింగ్

ఛత్తీస్ ఘడ్, మిజోరం లలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఛత్తీస్ ఘడ్ లో మొదటి విడత 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మిజోరంలో 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 నుంచి పోలింగ్ మొదలయ్యింది.

దేశంలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది. నవంబర్, డిసెంబర్ లలో వరుసగా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొట్టమొదటగా ఛత్తీస్‌ఘడ్, మిజోరంలలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. ఛత్తీస్‌ఘడ్ లో రెండు విడతలగా పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి విడతగా ఈ రోజు 20 స్థానాలకు అక్కడ పోలింగ్ మొదలయ్యింది. ఉదయం 7 గంటల నుంచి ఇది ప్రారంభం అయింది. మావోయిస్టు ప్రబావిత్ ప్రాంతాలఉ అయిన 7 జిల్లాల్లో పోలింగ్ జరుగుతండడం వలన అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందులోని నిన్న ఒక బాంబు పేలుడు జరిగి ఒక పోలీస్ కూడా చనిపోవడంతో డిపార్ట్ మెంట్ మరింత అప్రమత్తమైంది. బస్తర్, జగదల్ పూర్, చిత్రకోట్లలో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది. మిగతా సమస్యాత్మక ప్రాంతాలలో మధ్యాహ్నం 3 వరకు మాత్రమే నిర్వహిస్తారు. 20 స్థానాల్లో 223 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఛత్తీస్ ఘడ్ లో మొత్తం 90 స్థానాలున్నాయి. మిగతా 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ కాంగ్రెస్ కు బలం ఎక్కువ. ఈ సారి కూడా ఆ పార్టీనే విజయం సాధిస్తుందని పోల్ సర్వేలు చెబుతున్నాయి.
నేడు ఓటింగ్ కోసం 5,304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 40.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 19.93 లక్షలు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 20.84 లక్షలు. 69 మంది ఓటర్లు థర్డ్ జెండర్.

తొలి దశ ఓటింగ్‌లో బీజేపీకి చెందిన 20 మంది, కాంగ్రెస్‌కు చెందిన 20 మంది, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 10 మంది, బీఎస్పీకి 15 మంది, జేసీసీ (జే)కి చెందిన 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాజ్‌నంద్‌గావ్ స్థానం నుంచి 29 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అదే సమయంలో చిత్రకోట్, దంతెవాడలో కనీసం 7 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 223 మంది అభ్యర్థుల్లో 25 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
ఇక మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ అన్నీ ఒకేసారి నిర్వహిస్తున్నారు. 40 స్థానాల్లో 174 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.

 

Share post:

లేటెస్ట్