గద్దర్ అవార్డులు.. మార్చి 13 నుంచి దరఖాస్తుల స్వీకరణ

‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా’… ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా’..అంటూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో యువతకు తిరుగుబాటు నేర్పిన తెలంగాణ ఉద్యమ నేత, కవి, గాయకుడు, విప్లవ కార్యకర్త గుమ్మడి విఠల్ రావు (Gummadi Vital Rao) అదేనండి గద్దర్ గురించి తెలియని తెలంగాణ వాసి ఉండరు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట పురస్కారాలు అందజేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తాజాగా గద్దర్ సినీ అవార్డులకు తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ( తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్) ఎంట్రీలను ఆహ్వానించింది.

గద్దర్ (Gaddar Awards 2025) తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ తాజాగా రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణ చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.  2014 నుంచి 2023 వరకూ ఒక్కో ఏడాదికి ఉత్తమ చలన చిత్రానికి అవార్డు ఇవ్వాలని సంకల్పించారు. మార్చి 13వ తేదీ నుంచి ఈ పురస్కారాల కోసం దరఖాస్తులను స్వీకరించనుంది.

అవార్డులు.. కేటగిరీలు

  1. ఫీచర్ ఫిల్మ్స్
  2. జాతీయ సమైక్యతపై చలన చిత్రం
  3. బాలల చలన చిత్రం. *పర్యావరణం/హెరిటేజ్/ చరిత్ర లపై చలన చిత్రం
  4. డెబ్యూట్ ఫీచర్ ఫిల్మ్స్
  5. యానిమేషన్ ఫిలిం
  6. స్పెషల్ ఎఫెక్ట్ ఫిల్మ్స్
  7. డాక్యుమెంటరీ ఫిల్మ్స్
  8. షార్ట్ ఫిల్మ్స్

ఇతర కేటగిరీలు

  1. తెలుగు సినిమాలపై బుక్స్/ విశ్లేషణాత్మక వ్యాసాలు
  2. ఆర్టిస్టులు/ టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *